గవర్నర్ గారికి వివరించి నివేదిక ఇచ్చిన తెలుగుదేశం పార్టీ

 రాజ్ భవన్,విజయవాడ (ప్రజా అమరావతి)


తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కేంద్ర కార్యాలయంలో మొన్న వైసీపీ గుండాలు లోపలకు వెళ్లి అక్కడ ఉన్న కార్లు,ఆఫీస్ ఫర్నిచర్,పార్టీ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందిని,కార్యకర్తలును దాడి చేసిన సంఘటన గురించి గవర్నర్ గారికి వివరించి నివేదిక ఇచ్చిన తెలుగుదేశం పార్టీ


రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడువారితో టీడీపీ ముఖ్య నేతలు పాల్గున్నారు...


 అనంతరం మీడియా సమావేశంలో పాల్గున్నారు.


గవర్నర్ ముందు రెండు డిమాండ్లు పెట్టాం. రాష్ట్రంలో ఆర్టికల్ 356 విధించాలి. టీడీపీ కార్యాలయంపై దాడుల గురించి వివరించాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా క్షీణించాయి. మా ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తాం. పార్టీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే కార్మికులపైనా దాడి చేశారు.


తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు్..