ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి);
భక్తుల సేవలో వైద్య ఆరోగ్య శాఖ...
శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజులు భక్తులకు కావలసిన అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడటం, మాస్కులు మర్చిపోయి వచ్చిన వారికి ఉచితంగా మాస్కులు అందించడం వంటి సేవలను అందిస్తున్నారు.
తొమ్మిది చోట్ల ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు...
కొండ దిగువన, వినాయకుడి గుడి వద్ద,కనక దుర్గ నగర్, గోసాల, సీతమ్మ వారి పాదాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ ఎదురుగా, కొండపైన రిసెప్షన్ వద్ద, చిన్న రాజ గోపురం వద్ద, శివాలయం వద్ద ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు సేవలందిస్తున్నారు. ఈ వైద్య శిబిరాల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచి నిపుణులైన డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలకు 10 బెడ్ల ఆసుపత్రి కూడా ఏర్పాటు చేశారు.
మూడు అంబులెన్సులు సిద్ధం..
అత్యవసర పరిస్థితిలో భక్తులకు అందుబాటులో ఉండేలా దేవస్థానానికి చెందిన అంబులెన్స్ తో పాటు కొండపైన, కొండ దిగువన అంబులెన్స్ లను సిద్దంగా ఉంచారు.
వినాయకుడి గుడి వద్ద ఐసోలేషన్ పాయింట్ ఏర్పాటు చేసి అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
శరన్నవరాత్రి ఉత్సవాలకు విధులు నిర్వర్తించే దేవస్థానం సిబ్బందికి ర్యాపిడ్ టెస్టులు ముందుగానే నిర్వర్తించటం, వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తి చేయడం వంటి ముందస్తు జాగ్రత్తలను తీసుకోవడం జరిగింది.
addComments
Post a Comment