జిల్లా వ్యాప్తంగా తొమ్మిది చోట్ల రైస్ మిల్లులపై దాడులు

 గుంటూరు, 22 అక్టోబరు (ప్రజా అమరావతి) : - జిల్లాలో అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయ్, రెవెన్యూ శాఖల అధికారులు  గత నెల రోజులుగా దాడులు నిర్వహించి సుమారు 1200 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకొని కేసులు నమోదు చేసినట్లు సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా – రెవెన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్ పేర్కొన్నారు.

శుక్రవారం సాయంత్రం  కలెక్టరేట్ లోని డి.ఆర్.సి హాల్ లో  సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా – రెవెన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి పద్మశ్రీ తో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది చోట్ల రైస్ మిల్లులపై దాడులు


చేసి అక్రమంగా ఉన్న రేషన్ బియ్యం నిల్వలను పట్టుకున్నామన్నారు. రైసు మిల్లుల వారి వద్ద నుంచి ప్రతీ రోజూ వినియోగించే రికార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు. పలువురు వ్యక్తులు, వాహనదారులు, రైస్ మిల్లర్లపై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. వాటికి సంబంధించిన వివరాలను సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా – రెవెన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్  మీడియాకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని రూ. 39 లకు కొనుగోలు చేసి అర్హులైన పేదలకు  ఒక్క రూపాయి కే అందించడం జరుగుతుందని తెలిపారు. అయితే కొందరు వ్యాపారులు, అక్రమార్కులు  మోసాలకు  పాల్పడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రభుత్వం  స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఎక్కడకు తరలిపోతున్నాయన్న అంశంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామన్నారు. గతంలో లాగా రేషన్ బియ్యం కేసుల నుంచితప్పించు కోకుండా 6-ఎ కేసులతో పాటుగా  అండర్ సెక్షన్ 7 క్రింద కూడా  కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. దీంతో పాటుగా పలు మార్లు అక్రమ రేషన్ బియ్యం తరలిస్తూ పట్టుబడితే వారిపై క్రిమినల్ కేసులు, పి.డి.స్ చట్టం 1955 ప్రకారం పి.డి చట్టం ప్రయోగిస్తామన్నారు. మొత్తం నెల రోజుల్లో 9 కేసులు నమోదు చేశామన్నారు. వాటి వివరాలను మీడియాకు వివరించారు.  స్వాధీనం చేసుకున్న రేషన్ పిడిఎస్ బియ్యాన్ని నాణ్యతను పరిశీలన చేయడం ద్వారా రూఢీ చేసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మొత్తం నెల రోజులుగా రూ. 3,11,87,000/లు విలువైన బియ్యం పట్టుకున్నామన్నారు. ఇటువంటి కేసుల్లో రైసు మిల్లర్లు ఉన్నట్లు తేలితే వారి మిల్లులను సీజ్ చేయడంతో పాటు వారికి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తామన్నారు. అక్రమ బియ్యం తరలించే వాహనాలను రిజిస్ట్రేషన్లు రద్దు చేయడం, వారి లైసెన్స్ లు రద్దు చేస్తామని తెలిపారు. అనవసరంగా అక్రమ బియ్యం రవాణాకు ఎవ్వరూ సహకరించవద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి  ఆధ్వర్యంలో ఎక్కడా లేని విధంగా స్టార్టెక్స్  నాణ్యమైన బియ్యాన్ని అందజేస్తున్నారని పేర్కొన్నారు. నాణ్యమైన రేషన్ బియ్యంపై కొంతమంది అపోహలు సృష్టించి అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరిస్తున్నట్లు తెలిపారు.

Comments