ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి);
రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయండి.... దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి వాణిమోహన్.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12వ తేదీ మంగళవారం మూలానక్షత్రం రోజున సరస్వతి దేవి అవతారం లో దర్శనమిస్తున్న కనకదుర్గ అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నరన్నారు.ఈ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లుచేసి సిద్ధంగా ఉండాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి. వాణిమోహన్ తెలిపారు. ముఖ్యమంత్రి దుర్గగుడికి విచ్చేసే కార్యక్రమానికి చేయవలసిన ఏర్పాట్లపై దేవాదాయ, పోలీసు అధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ ఆదివారం ఆలయ కార్యనిర్వహణ అధికారి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు,నాల్గు గంటల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఆలయానికి రానున్నారన్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకునే ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రులకు,ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు దేవాదాయశాఖ తరపున స్వాగతం పలకడం జరుగుతుందని.అనంతరం ముఖ్యమంత్రిని చిన రాజగోపురం వద్దకు తోడ్కొని వస్తామన్నారు. అక్కడ ఆలయ స్థానాచార్యులు ముఖ్యమంత్రికి పరివేష్టితం నిర్వహిస్తామని అన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు విచ్చేసే ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి అంతరాలయంలోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు. అంతరాలయంలో ముఖ్యమంత్రివర్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, అనంతరం వేద ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అందచేయటం జరుగుతుందని అన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి సిధ్ధంగా ఉండాలని అన్నారు. ఆలయ వేద పండితులు ముఖ్యమంత్రికి పరివేష్టితం, పూర్ణకుంభస్వాగతం, పూజలు నిర్వహించడం, శేష వస్త్రాలు సమర్పించడం సంబంధించి తదితర కార్యక్రమాలకు ముందుగానే కావలసినవి సిద్ధం చేసుకోవాలని ఆమె సూచించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించి అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమం విజయవంతం చేయాలని ఆమె తెలిపారు.
ఈ సమావేశంలో ఆలయ ఈవో డి భ్రమరాంబ, ఏసిపి హనుమంతరావు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్ర కుమార్, రీజనల్ జాయింట్ కమిషనర్ సాగర్ బాబు, సీత డైరెక్టర్ రామచంద్రరావు, అన్నవరం, పెనుగంచిప్రోలు, ద్వారకాతిరుమల దేవస్థానాల కార్య నిర్వహణాధికారులు త్రినాధ రావు, మూర్తి, సుబ్బారెడ్డి వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
addComments
Post a Comment