తిరుపతి (ప్రజా అమరావతి);
*గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 11 వ తేది న చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతి, తిరుమల పర్యటన నేపథ్యంలో గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు పర్య టించనున్న ప్రాంతా లైన శ్రిపద్మావతీ చిన్న పిల్లల హృదయాల యo,అలిపిరి మెట్ల మార్గం వద్ద గోశాల లో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఏర్పాటు చేయవలసిన బారి కేడింగ్ ,భద్రతా ఏర్పాట్లపై మంగళ వారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు ,టిటిడి జెఈఓ వి.వీరబ్రహ్మం, జిల్లా జాయింట్ కలెక్టర్ ( రెవిన్యూ) రాజాబాబు లతో కలసి పరిశీలించారు*
*ప్రధానంగా గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పర్యటించే ప్రదేశాలలో బారి కేడింగ్,బందోబస్తు, మీడియా పాయింట్, ఇతర సంబందిత అంశాలపై అధికారులతో చర్చించారు.*
*శ్రీ పద్మావతీ చిన్న పిల్లల హృదయాలయo,గోశాల ప్రారంభోత్సవాలకు సంబంధించి అక్కడ ఏర్పాటు
చేయవలసిన అంశాలపై అధికారులకు తగు సూచనలు జారీ చేశారు.*
*ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి , తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ హరిత,టిటిడీ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వర్ రావు,శ్రీ పద్మావతీ చిన్న పిల్లల హృదయాలయ స్పెషల్ ఆఫీసర్ డా.రెడ్డెప్ప రెడ్డి, ఇంచార్జి డా.శ్రీనాథ రెడ్డి, ట్రాన్స్కో ఎస్.ఈ. చలపతి ,తిరుపతి తహసీల్దార్ వెంకట రమణ,ఇతర సంబందిత అధికారులు పాల్గొన్నారు.*
addComments
Post a Comment