డిసెంబర్, 1, 2వ తేదీలలో నీతీ ఆయోగ్ బృందం రాష్ట్రంలో పర్యటన :

 

డిసెంబర్, 1, 2వ తేదీలలో నీతీ ఆయోగ్ బృందం రాష్ట్రంలో పర్యటన : 


           విజయవాడ, నవంబర్, 30 (ప్రజా అమరావతి):  నీతీ ఆయోగ్ ప్రత్యేక కార్యదర్శి డా.కె. రాజేశ్వరరావు ఆధ్వర్యంలోని 7గురు సభ్యులతో కూడిన బృందం డిసెంబర్, 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఢిల్లీ నుండి విమానంలో బయలుదేరి, 8. 15 నిలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. . అనంతరం విజయవాడ వెళతారు.  అనంతరం విజయవాడ నుండి బయలుదేరి 10 గంటలకు గన్నవరం మండలం వీరపనేనిగూడెం చేరుకొని 12 గంటల వరకు తెల్లం విజయ్ కుమార్ తో సమావేశమై  ప్రకృతి వ్యవసాయమునకు సంబందించిన అంశాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం వీరపనేనిగూడెంలో   ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తారు.  అనంతరం బృందం విజయవాడ చేరుకుంటారని కలెక్టర్ చెప్పారు.  అనంతరం మధ్యాహ్నం _కేబ్స్ గంటకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, వివిధ శాఖల రాష్ట్ర స్థాయి అధికారులను కలుస్తారన్నారు. సాయంత్రం 4. 30 నిల నుండి 5. 30 ని.ల వరకు వివిధ పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాల వారితో సమావేశంలో పాల్గొంటారు.  అనంతరం సాయంత్రం 5. 30 ని.ల నుండి 6. 30 ని.ల వరకు వివిధ యూనివర్సటీల వైస్ చాన్సుల్లోర్లు, విద్యా సంస్థల ప్రతినిధులు, సామజిక సంఘాల ప్రతినిధులతో సమావేశంలో పాల్గొంటారన్నారు.  విజయవాడలో రాత్రి బస చేస్తారు. 2వ తేదీ ఉదయం 8. 50 ని. లకు గన్నవరం నుండి విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారని కలెక్టర్ జె. నివాస్ చెప్పారు.