కొవ్వూరు (ప్రజా అమరావతి);
స్పందన కార్యక్రమంలో 10 ఫిర్యాదులు అందాయి.. ఆర్డీవో మల్లిబాబు
ప్రజలు ఇచ్చే ప్రతి ఒక్క స్పందన ఫిర్యాదునీ స్వీకరించి తగిన రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు.
సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో స్పందన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, ప్రజలు అందచేసే ఫిర్యాదు లను పారదర్శకంగా, జవాబుదారీతనం తో పరిష్కరించాలన్నారు. స్పందన లో వొచ్చే ప్రతి ఫిర్యాదు స్వీకరించి, స్పందన వెబ్ సైట్ లో తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలన్నారు. ప్రజలు అందచేసే ప్రతి ఫిర్యాదుకి రసీదు జారీ చేయలన్నారు. ఈ విషయంలో భాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సంబంధించిన వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇంటి స్థలం కొలతలు కోసం వొచ్చిన వ్యక్తికి సంబంధించిన గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే గ్రామ సర్వేయర్ ద్వారా కొలతలు చూపించుకోవాలని ఆర్డీవో సూచించారు.
ఈ రోజు స్పందన కార్యక్రమంలో పది ఫిర్యాదులు అందాయని, సామాజిక భద్రత పింఛను, వికలాంగ పింఛన్, ఆధార్ కార్డు , ఇంటి స్థలం కొలతలు, గృహ నిర్మాణం, వ్యవసాయ భూమి కొలతలు చేపట్టి, తగిన రక్షణ కల్పించాలని, వంటి వాటిపై ఫిర్యాదులు అందచేశారు. ప్రతి ఒక్క ఫిర్యాదు పరిష్కారానికి ప్రభుత్వం టైం లైన్స్ ఇవ్వడం జరిగిందని, వాటి ఆధారంగానే జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారుల పనితీరుకు గ్రేడింగ్ విధానం ఇవ్వడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఆధార్ లో చేర్పులు, మార్పులకు సంబంధించిన గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తగిన చొరవ చూపి మార్గదర్శనం చెయ్యాలన్నారు. తద్వారా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.
ఈ రోజు స్పందన కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపిడిఓ, డివిజన్ స్థాయి, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment