సోమవారం స్పందన లో 13 ఆర్జీలు వొచ్చాయి.. ఆర్డీవో



కొవ్వూరు (ప్రజా అమరావతి);


సోమవారం స్పందన లో 13 ఆర్జీలు వొచ్చాయి.. ఆర్డీవో



  స్పందన కార్యక్రమంలో మొత్తం 13 ఫిర్యాదులు అందాయని రెవెన్యూ అధికారి ఎస్. మల్లిబాబు  తెలియచేసారు. 


స్థానిక  ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ, ఈరోజు మొత్తం 13 మంది స్పందన లో పింఛను, ఇళ్ళ స్థలం, భూ సమస్య, రేషన్ కార్డు తొలగింపు పై అర్జీలు ఇచ్చారన్నారు. నిడదవోలు పరిధిలో స్థలం కోసం ఇదివరకే ఇచ్చిన ఆర్జి మరోసారి ఇచ్చారని, గతంలో ఇచ్చిన దరఖాస్తు పరిశీలనలో ఉండడంపై సంబంధించిన తహసీల్దార్ నుంచి వివరాలు తెలుసుకుని, ఆర్జి దారునికి తెలిపామన్నారు.



 ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాల య ఏ. ఓ,జి. ఎస్. ఎస్.జవ హర్ బాజీ, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.