ప్రశాంతంగా ముగిసిన 23 వ ఉప ఎన్నికలుకొవ్వూరు (ప్రజా అమరావతి);  


ప్రశాంతంగా ముగిసిన 23 వ ఉప ఎన్నికలు


మొత్తం ఓటర్లు 1413.. పోలైన ఓట్లు 943 (66.74శాతం)


కొవ్వూరు పురపాలక సంఘం 23 వ  వార్డు  కి జరిగిన ఉప ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా ముగిసాయని మునిసిపల్ కమిషనర్ టి. రవికుమార్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు.


ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలైందని, పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. వృద్ధులు, దివ్యంగుల కోసం వీల్ చైర్లు ఏర్పాటు చేసి, వారు ఓటు హక్కును వేసేందుకు సహకారాన్ని అందించడం జరిగిందని టి. రవి కుమార్ పేర్కొన్నారు.


మొత్తం ఓట్లు 1413.. పోలైన ఓట్లు 943 (67.74  శాతం)


మొత్తం రెండు పోలింగ్ కేంద్రాల్లో1413 మంది ఓటర్లలో పురుషులు 740 లో 452 మంది,  స్త్రీ లు 673 లో 491 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 17వ తేదీ బుధవారం ఉదయం 8 నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని రవికుమార్ తెలిపారు.