నవంబరు 27న ఆన్ లైన్ లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు విడుదల

 నవంబరు 27న ఆన్ లైన్ లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు విడుదల

తిరుమల, 25 నవంబరు 2021 (ప్రజా అమరావతి): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత(స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.

తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయడం జరుగుతుందని టిటిడి తెలిపింది.

భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

Comments