మోటారు ట్రాన్సుపోర్టు వాహనాల పన్ను చెల్లించే గడువు ఈనెల 30వరకూ గడువు పెంపు.

 మోటారు ట్రాన్సుపోర్టు వాహనాల పన్ను చెల్లించే గడువు ఈనెల 30వరకూ గడువు పెంపు.

అమరావతి,11 నవంబరు (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్ను చట్టం-1963 ప్రకారం 31-12-2021 త్రైమాసికానికి సంబంధించి 31 అక్టోబరు 2021 లోగా చెల్లించాల్సిన మోటారు వాహనాల పన్ను చెల్లించే గడువును మరో నెల గ్రేస్ ఫీరియడ్ గా అనగా నవంబరు 30వ తేదీ వరకూ పొడిగించిన్నట్టు రాష్ట్ర రవాణా మరియు రోడ్లు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి యం.టి కృష్ణ బాబు తెలియజేశారు. ఈమేరకు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 328 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. కావున ఈనెల 30వతేదీ లోగా మోటార్ ట్రాన్సుపోర్టు వాహనాల పన్నును చెల్లించాల్సిందిగా ఆయన తెలియజేశారు.