ఏడు ఎంపిటిసి స్థానాలకు దాఖలైన 33 నామినేషన్లు స్క్రూటిని అనంతరం ఉన్నవి 28 ..ఆర్డీవో ఎస్. మల్లిబాబుకొవ్వూరు (ప్రజా అమరావతి) ;  


ఏడు ఎంపిటిసి స్థానాలకు దాఖలైన 33 నామినేషన్లు స్క్రూటిని అనంతరం  ఉన్నవి 28 ..ఆర్డీవో ఎస్. మల్లిబాబు


ఏడు ఎంపిటిసి స్థానాలకు 33 నామినేషన్ లు దాఖలు కాగా స్క్రూటిని అనంతరం చెల్లుబాటు అయిన నామినేషన్ లు 28 ఉన్నాయని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. 


కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన ఏడు ఎంపిటిసి స్థానాలలో  స్క్రూటినీ అనంతరం అత్తిలి మండలంలో ఈడూరు   ఒక్క నామినేషన్,  చాగల్లు మండలంలో చాగల్లు-5 కి ఒక్క నామినేషన్ మాత్రమే ఉన్నాయన్నారు. స్క్రూటినీ తదుపరి ఒకటి కంటే ఎక్కువ నామినేషన్ లు ఉన్న ఎంపిటిసి స్థానాలు  అత్తిలి మండలం పాలూరు లో ఆరు,  , ఇరగవరం మండలంలో కె. కుముదవల్లి లో మూడు, పెరవలి మండలంలో కానూరు-2 లో మూడు, నిడదవోలు మండలంలో తాళ్లపాలెం లో ఆరు, తాళ్లపూడి మండలంలో వేగేశ్వరపురం-2 లో ఎనిమిది  నామినేషన్ లు సక్రమంగా దాఖలు చెయ్యడం జరిగిందన్నారు. తిరస్కరించిన నామినేషన్లు పై అప్పీల్ చేసుకొనుటకు 7వ తేదీ  ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉందన్నారు. 8వతేది పోటీలో ఉన్నవారి జాబితా ప్రకటించడం జరుగుతుందని, నామినేషన్ లు ఉపసంహరణ కి అభ్యర్థులు కు మ.3 వరకు సమయం ఉంటుందన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా 9వ ప్రకటిస్తారన్నారు.
నోట్ : స్క్రూటిని అనంతరం ఉన్న నామినేషన్లు () బ్రాకెట్ లో చూపడమైనది  Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image