సుమారుగా 495 కేజీల గంజాయి పట్టివేత
* పోలీసులు తప్పించుకుని దూసుకెళ్లిన రెండు కార్లు
* సుమారుగా 15 లక్షల విలువైన గంజాయి పట్టివేత
* గజపతినగరం సమీపంలో పట్టుబడ్డ కార్లు
* కార్లును వదిలేసి పారిపోయిన గంజాయి ముఠా
* ఒకరు అరెస్టు, పరారీలో ఉన్న ముగ్గురు వ్యక్తులు
* రెండు కార్లును సీజ్ చేసి ఆండ్ర పోలీస్ స్టేషన్ కు తరలింపు
* విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి మోహన్ రావు
విజయనగరం (ప్రజా అమరావతి);
విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రెండు కార్లు లలో సుమారు 495 కేజీలు గురువారం ఆండ్ర పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తన సిబ్బందితో చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే అనంతగిరి మండలం నుంచి ఒరిస్సాకు చెందిన రెండు కార్లతో గురువారం వేకువజామున గంజాయిని తరలిస్తుండగా ఆండ్ర పోలీసులు సమాచారం తెలుసుకునే పోలీస్ స్టేషన్ వద్ద మాటు వేయగా ఆ రెండు కార్లు పోలీసులను తప్పించుకుని దూసుకు వెళ్లారు. పోలీసు కానిస్టేబుల్ మామిడి అప్పన్న, హోంగార్డు గణపతిలు ఆకారాలను వెంబడించి గజపతినగరం మండలం పురిటి పంట గ్రామ సమీపంలో ఆ కార్లను పట్టుకున్నారు. ఇంతలో కార్లనువదిలేసి ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. అద్దాలు పగలగొట్టి గంజాయి ఉన్నట్లు నిర్ధారించా రు. ఆ కార్లను సీజ్ చేసి ఆండ్ర పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బొబ్బిలి డి.ఎస్.పి మోహన్ రావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సుమారుగా 15 లక్షల విలువైన గంజాయి పట్టుకోవడం జరిగింది. ఒరిస్సాకు చెందిన క్రెటా కార్లు ఓ డి 33ఏసీ 3294, ఓ డి 05 బి ఎ 8506 కార్లలో అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా ఆంధ్ర పోలీసులు పట్టుకున్నారు. ఒక్కొక్క కార్ లో ఇద్దరు చొప్పున ఉన్నారనిఅన్నారు. ముగ్గురు వ్యక్తులు పరార్ కాగా ఒక వ్యక్తి సుగుణ ప్రధాన్( 21) పట్టుబడ్డాడు. పట్టు పట్ట వ్యక్తి ఒరిస్సా గ్రామానికి చెందిన దుబ్బ నాని గ్రామం, పాలే బట్ట బ్లాక్, అంకూర్ జిల్లాకు చెందిన వాడని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం సి ఐ రమేష్ కుమార్,ఆండ్రసబ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, గజపతినగరం సబ్ ఇన్స్పెక్టర్ గంగరాజు, మండల తాసిల్దార్ దూసి రవి, తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment