ఇంటి స్థలం పట్టాతో పాటు 5 ఎకరాల వ్యవసాయ సాగు భూమి

 


సుగాలి ప్రీతి బాయి కుటుంబ సభ్యులకు 5 సెంట్లు ఇంటి స్థలం పట్టాతో పాటు 5 ఎకరాల వ్యవసాయ సాగు భూమి


పట్టాను అందజేసిన జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు :-


కర్నూలు, నవంబర్ 12 (ప్రజా అమరావతి):


రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సుగాలి ప్రీతి బాయి కుటుంబ సభ్యులకు శుక్రవారం రాత్రి 5 సెంట్లు ఇంటి స్థలం పట్టాతో పాటు ఐదు ఎకరాల వ్యవసాయ సాగు భూమిని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు అందజేశారు.


ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వం  బాధితురాలు తండ్రి రాజు నాయక్ కు రెవెన్యూ శాఖలో ఉద్యోగం కల్పించారు. ఈ సందర్భంగా కల్లూరు గ్రామంలో 5 సెంట్లు ఇంటి స్థలం పట్టాతో పాటు దీన్నే దేవరపాడు గ్రామంలో ఐదు ఎకరాల వ్యవసాయ సాగు భూమి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వానికి సుగాలి ప్రీతి బాయి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా, డి ఆర్ ఓ పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.