5 గ్రామ వార్డు ఎన్నికలకు గాను రెండు గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుండగా, మూడు చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయ

 


కొవ్వూరు (ప్రజా అమరావతి); 



కొవ్వూరు డివిజన్ పరిధిలోని 5 గ్రామ వార్డు ఎన్నికలకు గాను రెండు గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుండగా, మూడు చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయని డివిజనల్ పంచాయతీ అధికారి భమిడి శివ మూర్తి మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. 



కొవ్వూరు డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన 5 గ్రామ వార్డులకు జరిగే ఎన్నికల కోసం  చాగల్లు మండలం ఎస్. ముప్పవరం గ్రామంలో బొర్రా వనజారాణి, గోపాలపురం లో చెరుకుమిల్లి గ్రామంలో 7వ వార్డుకి ముళ్ళపూడి వివేకానంద, పెరవలి మండలం లో అన్నవరప్పాడు గ్రామంలో 12వ వార్డుకి వసంతవాడ బుజ్జి  లు వార్డు సభ్యులు గా ఏకగ్రీవం అయ్యారు. 



కొవ్వూరు లో కాపవరం గ్రామంలో 9వ వార్డుకి ఇద్దరు అభ్యర్థులు  గోతం మేరీ ఝాన్సీభాయ్, మొహమ్మద్ ఫసి ఉల్లా బేగ్ లు పోటీ లో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓట్లు 213 కాగా పురుషులు 111, మహిళలు 102 మంది ఉన్నారు. ఎంపిపి స్కూల్ లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 


పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామం 8 వ వార్డు ఎన్నికకు ఇద్దరు అభ్యర్థులు కె.సాంబశివరావు, జీ. నాగార్జున పోటీలో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓట్లు 213 కాగా పురుషులు 108, మహిళలు 105 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రం గ్రామ పంచాయతీ కమ్యూనిటీ హాల్ ఉత్తరం గదిలో ఓటింగ్ ప్రక్రియ కి ఏర్పాట్లు పూర్తి చేశారు.





Comments