బుధవారం నాడు ఎంపిటిసి స్థానాలకు 6, గ్రామ వార్డుకి ఒక నామినేషన్ దాఖలుకొవ్వూరు   (ప్రజా అమరావతి);


బుధవారం నాడు ఎంపిటిసి స్థానాలకు 6, గ్రామ వార్డుకి ఒక నామినేషన్ దాఖలుకొవ్వూరు డివిజన్ పరిధిలోని ఆరు మండలాలు పరిధిలో  ఒక జెడ్పీటిసి, 7 ఎంపిటిసి ,  5 గ్రామ పంచాయతీ వార్డులు , కొవ్వూరు పురపాక సంఘం లోని ఒక వార్డు స్థానాల ఎన్నికలకు ఈరోజు నామినేషన్ ల స్వీకారానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో ప్రారంభించడం  జరిగిందని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. 


ఈరోజు ఆర్వో లు ఇచ్చిన నివేదిక ఆధారంగా  ఆర్డీవో మల్లిబాబు నామినేషన్లు వివరాలు తెలియచేసారు.  


కొవ్వూరు డివిజన్ లోని  ఏడు ఎంపిటిసి స్థానాలకు గాను ఆరు నామినేషన్ లు, ఐదు  పంచాయతీ  వార్డు లకు గాను ఒక్క నామినేషన్ ను అభ్యర్థులు వెయ్యడం జరిగిందన్నారు. 


పెనుగొండ జెడ్పిటిసి స్థానానికి, కొవ్వూరు పురపాలక సంఘం 23 వ వార్డు కి ఎవ్వరూ బుధవారం నామినేషన్లు వెయ్యలేదన్నారు.


ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్లు అత్తిలి మండలంలో ఈడూరు ( ఒక నామినేషన్ ); పాలూరు  (లేవు), చాగల్లు లో చాగల్లు-5  (లేవు),

 ఇరగవరం లో కె. కుముదవల్లి (రెండు), పెరవలి లో కానూరు-2 (ఒకటి); నిడదవోలు లో తాళ్లపాలెం (ఒకటి);  తాళ్లపూడి లో వేగేశ్వరపురం-2 (ఒకటి) చొప్పున నామినేషన్ లు వెయ్యడం జరిగిందన్నారు.


గ్రామ పంచాయతీ వార్డు ఎన్నికల్లో భాగంగా 


  కొవ్వూరు డివిజన్ పరిధిలో 5 పంచాయతీ వార్డుల కిగాను   చాగల్లు మండలం ఎస్. ముప్పవరం గ్రామంలో 3వ వార్డుకి ఒక వ్యక్తి ఈరోజు నామినేషన్ వెయ్యడం జరిగిందని తెలిపారు.  గురువారం, శుక్రవారం కూడా ఆర్వో లు,  నామినేషన్ లు స్వీకరిస్తారని తెలిపారు.