పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామం 8 వ వార్డు సభ్యునిగా కె.సాంబశివరావు గెలుపుకొవ్వూరు డివిజన్ (ప్రజా అమరావతి) ;  గోతం మేరీ ఝాన్సీభాయ్.. కాపవరం 9వ వార్డు మెంబెర్ గా గెలుపు


పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామం 8 వ వార్డు సభ్యునిగా కె.సాంబశివరావు గెలుపు
కొవ్వూరు డివిజన్ పరిధిలోని పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాపవరం, మల్లేశ్వరం గ్రామాల్లో రెండు వార్డులకు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. కాపవరం 9వ వార్డులో 213 ఓటర్ల కి గాను 193 మంది తమ ఓటుహక్కు ను వినియోగించు కున్నారని డివిజనల్ పంచాయతీ అధికారి బిహేచ్ ఎస్ ఎస్ ఎన్ మూర్తి తెలిపారు.


కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో 9వ వార్డు ఇద్దరు అభ్యర్థులకి  గోతం మేరీ ఝాన్సీభాయ్ కి 98 ఓట్లు, మొహమ్మద్ ఫసి ఉల్లా బేగ్ కి 92 ఓట్లు పొలయ్యాయి.  చెల్లని ఓట్లు మూడు ఉన్నాయి. గోతం మేరీ ఝాన్సీభాయ్ వార్డు సభ్యురాలిగా గెలుపొందారని ఆర్వో ప్రకటించారు  కాపవరం ఓట్ల లెక్కింపు ప్రక్రియను డీఎల్ డిఓ/ ఎంపిడిఓ పి. జగదాంబ పర్యవేక్షణ చేశారు.


మల్లేశ్వరం 8వ వార్డు లో 213 ఓటర్లు కిగాను 179 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందన్నారు.  పోటీలో  ఇద్దరు అభ్యర్థుల కె.సాంబశివరావు కి 121 ఓట్లు , జీ. నాగార్జున కి 54 కి ఓట్లు పోలైయ్యాయి. చెల్లని ఓట్లు నాలుగు ఉన్నాయి. కె.సాంబశివరావు ...  మల్లేశ్వరం 9వ వార్డు సభ్యునిగా గెలుపొందారు.  డివిజనల్ పంచాయతీ అధికారి భమిడి శివ మూర్తి మల్లేశ్వరం పోలింగ్ కేంద్రాన్నీ సందర్శించి ఓటింగ్ సరళి ని పరిశీలించారు. అంతకుముందు పెరవలి మండలం లో కౌంటింగ్ ప్రక్రియ ను పర్యవేక్షణ చేశారు.