చాగల్లు (ప్రజా అమరావతి);
జిల్లా వ్యాప్తంగా 874 ఆర్భికెలు ద్వారా సోమవారం నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రారంభించాం..
జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా
జిల్లాలో 13.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కి 874 అర్భికే ల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు.
సోమవారం చాగల్లు గ్రామంలో పిపిసి కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ, జిల్లాలో 15.02 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారని తెలిపారు. ఈ ప్రక్రియ ను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసేందుకు 350 సొసైటీ లు సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలను నిర్వహణ కోసం కావలసిన సిబ్బంది, సాంకేతిక సిబ్బంది, నియమించు కోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి లక్ష్యాల మేరకు ప్రణాళికలు తయారు చేసుకుని కొనుగోళ్లు సత్వరం పూర్తిచేయాలని ఆదేశించారు. ధాన్యం పండించే ప్రాంతాల్లో ఉన్న 874 ఆర్భికెలను గుర్తించడం జరిగిందన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ రైతులు నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టాల్సి ఉందన్నారు. అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించాలని స్పష్టం చేశారు.
కలెక్టర్ వెంట జేసీ (రెవెన్యూ) డా.బి.ఆర్.అంబేద్కర్, జెడి అగ్రికల్చర్ ఎమ్. జగ్గారావు, డిసిఓ ఎస్. మురళీకృష్ణ, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ డి. రాజు, తహసిల్దార్, ఎంపిడిఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment