చెల్లుబాటు అయిన నామినేషన్ లు 9 ఉన్నాయని



కొవ్వూరు (ప్రజా అమరావతి) ;  


కొవ్వూరు డివిజన్ పరిధిలో ఎన్నికలు జరగనున్న 5 గ్రామ వార్డు లకి   తొమ్మిది నామినేషన్లు దాఖలు కాగా స్క్రూటిని అనంతరం చెల్లుబాటు అయిన నామినేషన్ లు 9 ఉన్నాయని ఆర్డీవో ఎస్. మల్లిబాబు శనివారం ఒక ప్రకటన లో తెలిపారు.


కొవ్వూరు డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన 5 గ్రామ వార్డులకు జరిగే ఎన్నికల కోసం  చాగల్లు మండలం ఎస్. ముప్పవరం గ్రామంలో 3వ వార్డుకి (రెండు), గోపాలపురం లో చెరుకుమిల్లి గ్రామంలో 7వ వార్డుకి (ఒకటి), కొవ్వూరు లో కాపవరం గ్రామంలో 9వ వార్డుకి (రెండు) , పెరవలి మండలం లో అన్నవరప్పాడు గ్రామంలో 12వ వార్డుకి (ఒకటి) ;  మల్లేశ్వరం గ్రామంలో 8వ వార్డు కి (మూడు) నామినేషన్లు  సక్రమంగా దాఖలు చెయ్యడం జరిగిందన్నారు. తిరస్కరించిన నామినేషన్లు పై అప్పీల్ చేసుకొనుటకు 7వ తేదీ  ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉందన్నారు. 8వతేది పోటీలో ఉన్నవారి జాబితా ప్రకటించడం జరుగుతుందని, నామినేషన్ లు ఉపసంహరణ కి అభ్యర్థులు కు మ.3 వరకు సమయం ఉంటుందన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా 9వ ప్రకటిస్తారన్నారు



కొవ్వూరు మునిసిపాలిటీ 23 వ వార్డు : 


కొవ్వూరు  మునిసిపాలిటీ  23 వ వార్డుకి దాఖలైన తొమ్మిది నామినేషన్ లు సక్రమంగా ఉన్నాయని మునిసిపల్ కమిషనర్ టి. రవికుమార్ తెలిపారు.  8వ తేదీన నామినేషన్లు ఉపసంహరణ కు మ.3 గంటల వరకుసమయం  ఉందన్నారు.  అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ను   ప్రకటిస్తారన్నారు. 


నోట్ : స్క్రూటిని అనంతరం ఉన్న నామినేషన్లు () బ్రాకెట్ లో చూపడమైనది  


Comments