ఇష్టారాజ్యంగా భూగర్భజలాలను వినియోగించే పరిశ్రమలపై దృష్టి సారించాలన్న మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 

అమరావతి (ప్రజా అమరావతి);


- వాల్టా చట్టంపై సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరారెడ్డి సమీక్ష

- సమావేశంలో పాల్గొన్న పిఆర్‌&ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఇరిగేషన్ సెక్రటరీ శ్యామలరావు,  పిఆర్‌&ఆర్డీ కమిషనర్ కోనా శశిధర్, డిఎంజి విజి వెంకటరెడ్డి, వాటర్ షెడ్ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు

- కేంద్రప్రభుత్వ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ (సిఇడబ్ల్యుఎ) నిబంధనల అమలుపై సమీక్ష

- ఇష్టారాజ్యంగా భూగర్భజలాలను వినియోగించే పరిశ్రమలపై దృష్టి సారించాలన్న మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


- కేంద్రప్రభుత్వం సిఇడబ్ల్యుఎ ప్రతిపాదనల్లో భాగంగా పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న భూగర్భ జలాలపై చార్జీల విధింపును పరిశీలించాలి

- కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఈ చార్జీల ఖరారులో పరిశ్రమలపై ఎక్కువ భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

- భూగర్భ జలాలను వినియోగించే చిన్న పరిశ్రమల పట్ల ఉదారంగా వ్యవహరించాలి

- జాతీయ స్థాయిలో భూగర్భ జలాల వినియోగంపై కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎపి వాల్టా చట్టంలో కూడా అవసరమైన మార్పులు తీసుకురావాలన్న మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

- తాగునీటి అవసరాలు, వ్యవసాయం కోసం వినియోగించే భూగర్భ జలాల విషయంలో ఎటువంటి చార్జీలను విధించకూడదన్న మంత్రి

- రానున్న రోజుల్లో భూగర్భజలాలు అడుగంటిపోకుండా, వాటిని సరైన స్థాయిలో వినియోగించేందుకు కేంద్రం రూపొందించిన నిబంధనల అమలుపై అధికారులు అధ్యయనం చేసి తగిన మార్పులు చేసుకోవాలన్న మంత్రి.