కృష్ణా జిల్లా.. మైలవరం (ప్రజా అమరావతి);
మైలవరం నియోజకవర్గం ఆశాజ్యోతి, విద్యాదాత,ఇండో-అమెరికన్ వ్యవస్థాపకుడు, పరోపకారి లక్కిరెడ్డి బాలి రెడ్డి గారు,ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, మైలవరం మండలంలోని వెల్వడం అనే గ్రామానికి చెందినవారు..
తన విద్యా జీవితంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థి, అతను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజనీరింగ్‌లో చేసారు..
అందులో ప్రతిభ కనబరిచినందుకు గోల్డ్ మెడల్‌ను స్వీకరించారు..
లక్కిరెడ్డి బాలి రెడ్డి గారు 1960 లో దర్కేలి స్కాలర్‌షిప్ సాదించి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లో కెమికల్ ఇంజనీరింగ్‌లో MS పూర్తి చేశారు..
కృష్ణా జిల్లా, మైలవరం లో లక్కిరెడ్డి బాలిరెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే జోగి రమేష్..
అపరిమితమైన శక్తి మరియు ఆలోచనలు కలిగిన వ్యక్తి, అతను హోటల్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యం లో విజయం సాదించారు..
లక్కిరెడ్డి బాలి రెడ్డి గారు ఒక మంచి కరుణ దాతృత్వం కలిగినటువంటి మానవతా వాది తాను పుట్టిన ఊరి ప్రజలకోసం లక్కిరెడ్డి బాలి రెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి లాభాపేక్ష లేకుండా సామాజిక ఆర్ధిక మరియు విద్య అబివృద్దికి ప్రముఖ దాతృత్వ కార్యకలాపాలు నిర్వహించారు. పేదలు, నిస్సహాయుల అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారు..
వృద్ధులకు, పేదలకు పెన్షన్లు తన వంతు సహాయం అందచేసారు..
కంటికి సంబంధించి శుక్ల శస్త్రచికిత్సలు ఎంతో మంది పేద ప్రజలకు చేయించారు..
వెల్వడం విలేజ్ లో secondary school బిల్డింగ్ నిర్మించి జిల్లా పరిషత్‌కు డొనేట్ చేసారు..
ఇక్కడ పేద విద్యార్ధులను దృష్టిలో పెట్టుకొని వెల్వడం అప్పర్ ప్రైమరీ school కట్టించి ఇచ్చారు..
వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా తాగునీటిని సరఫరా చేయించారు..
వెల్వడం గ్రామానికి డ్రైనేజీ మరియు రోడ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయించారు..
1998 లో తన తమ్ముడు శ్రీ లక్కిరెడ్డి జయప్రకాష్ రెడ్డి గారి ప్రోద్బలం తో లక్కిరెడ్డి బాలి రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలను స్థాపించారు..
యువతకు నాణ్యమైన విద్య మరియు ఉపాధి అవకాశాలను అందించడానికి లక్కిరెడ్డి బాలి రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలను తీర్చి దిద్దారు..
లక్కిరెక్డి బాలి రెడ్డి గారు TANA మరియు ATA వంటి అమెరికన్ తెలుగు అసోసియేషన్‌లలో తెలుగు విద్యార్దులకు ఆర్ధిక సహాయం చేసారని మంత్రి ఆళ్ల నాని కొనియాడారు..
addComments
Post a Comment