సచివాలయానికి వస్తున్న సర్వీసులను గడువులోపు పరిష్కరించాలి

 సచివాలయానికి వస్తున్న సర్వీసులను గడువులోపు పరిష్కరించాలి*


: జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి


రాప్తాడు మండలం లోని    బోమేపర్తి, హంపాపురం  గ్రామ సచివాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్*


రాప్తాడు,నవంబర్ 30 (ప్రజా అమరావతి)  సచివాలయానికి వస్తున్న సర్వీసులను   గడువులోపు  పరిష్కరించాలని

జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు.  మంగళవారం రాప్తాడు  నియోజక పరిధిలోని  బోమేపర్తి, హంపాపురం   గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ సచివాలయంలో రిజిస్టర్ లు, బయోమెట్రిక్ అటెండెన్స్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయానికి వస్తున్న సర్వీసులకు ఎప్పటికప్పుడు ఎలాంటి పెండింగ్ ఉంచకుండా గదువులోపు పరిష్కారం చూపించాలని, ఏ సర్వీసు కూడా గడువు తీరే వరకు పెండింగ్ ఉంచరాదన్నారు. సచివాలయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హత ఉన్న, అనర్హత కలిగిన లబ్ధిదారుల వివరాలను ఖచ్చితంగా ప్రదర్శించాలన్నారు. సచివాలయ ఉద్యోగులు జాగ్రత్తగా పని చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. సచివాలయం పరిధిలో చేపడుతున్న ప్రభుత్వ రెగ్యులర్ యాక్టివిటీలను కొనసాగించాలన్నారు. వర్షాల వల్ల ఈ ప్రాంతంలో దెబ్బతిన్న పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల దెబ్బతిన్న అర్హులైన వారికి పరిహారం వచ్చేలా చూడాలన్నారు. 

జిల్లాలోని ఒక్కో సచివాలయం రోజుకు కనీసం ఐదు మందికి సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ది చేకూర్చాలన్నారు. డిసెంబరు 2న నిర్వహించనున్న మెగా మేలాలో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొనేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పథకంపై డీఆర్డీఏ, మెప్మాల సహకారంతో ఆశావహులకు రుణాలు ఇప్పించి పథకంలో భాగస్వాములను చేయాలన్నారు. 

అదే సమయంలో వన్ టైం సెటిల్ మెంట్ లబ్ధిదారుల సర్వేను త్వరితగతిన పూర్తి  చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.


మధ్యాహ్న భోజనం అమలు తీరుపై   విద్యార్థులను ఆరా తీసి న జిల్లా  కలెక్టర్

  హంపాపురం  నందు  గ్రామ సచివాలయం ను సందర్శించిన అనంతరం, విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మధ్యాహ్నం భోజన అమలు తీరుపై ఆరా తీశారు. విద్యార్థులు   మాట్లాడుతూ  మా పాఠశాలలో రుచికరమైన భోజనం అందిస్తున్నారని  జిల్లా కలెక్టర్  తెలిపారు.  పదిహేను రోజుల్లోపు గ్రామస్తులకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తామని  జిల్లా కలెక్టర్ గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో వరప్రసాద్, 

 ఎంపీడీవో సాల్మన్ తహసిల్దార్ బి.ఈరమ్మ, ఈవో ఆర్ డి మాధవి, ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి, సర్పంచి ఆనంద రెడ్డి ఎంఈఓ మల్లికార్జున, పంచాయతీ కార్యదర్శి రామచంద్రరెడ్డి, వీఆర్ఓ లింగారెడ్డి, ఎంపీపీ భర్త చిట్రెడ్డి సత్తిరెడ్డి, హంపాపురం సర్పంచ్ లక్ష్మీదేవి పంచాయతీ కార్యదర్శి చరణ్ విఆర్వో జవహర్ఆర్ ఐ మౌనిక ఆర్డబ్ల్యూఎస్ ఓబుల దాస్  తదితరులు పాల్గొన్నారు 


Comments