పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న దృష్ట్యా సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్దేశించిన జలశక్తి మిషన్ మార్గదర్శకాలుపోలవరం (ప్రజా అమరావతి);


నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తూ  సాంకేతిక పరిజ్ఞానం, ఆర్ధిక అంశాల పరిధికి లోబడి పోలవరం ప్రాజెక్టు , నిర్వాసితులకు కాలనీలను పకడ్బందీగా పూర్తి చేయాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా స్పష్టం చేశారు.


బుధవారం పోలవరం ప్రాజెక్టు సమావేశ మందిరంలో ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్ అండ్ ఆర్, ఐ టి డి ఏ,  తదితర శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా అనిల్ కుమార్ ఝా మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న దృష్ట్యా సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్దేశించిన జలశక్తి మిషన్  మార్గదర్శకాలు మేరకు పనులు నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కి సంబంధించి ఇప్పటి వరకు చేసిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ని వాస్తవికత ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం పనులు పూర్తి చేయాలని సూచించారు. క్రమం తప్పకుండా పనుల పురోగతి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి పురోగతి పై నివేదికలు సమర్పించాలని పేర్కొన్నారు.  


ఈ సమావేశంలో భాగంగా అధికారులు అప్రోచ్ ఛానల్ 80 % పైగా పూర్తి అయినట్లు, స్పిల్ ఛానల్  కాంక్రీటు వర్కు దాదాపు పూర్తి చేసుకున్న వివరాలు తెలిపారు. ఎర్త్ వర్కు , కాంక్రీటు బ్లాక్ వెయ్యడం జరిగిన పురోగతి పై పవర్ పాయింట్ ద్వారా సమగ్ర వివరాలను వెల్లడించారు. ఖరీఫ్ 2022 నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  లక్ష్యం దిశగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు.. అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ వద్ద చేపడుతున్న పనుల ప్రగతి వివరాలు ఇంజనీర్లు తెలిపారు. ఆర్ అండ్ ఆర్ కింద 25.72 కాంటూర్ పరిధిలో ఉన్న 44 గ్రామాలు,  45.15 కాంటూర్ పరిధిలో ఉన్న 91 గ్రామాలకు చెందిన ప్రణాళికలు అధికారులు వివరించారు . మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నిరాశ్రయులైన కుటుంబాల పునరావాసం మరియు పునరావాసం బాధ్యత ను కమీషనర్,పోలవరం  ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి పర్యవేక్షణలోఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అనీల్ కుమార్ కు వివరించారు. భూసేకరణ కి సంబంధించి 1,67,338 ఎకరాలు లక్ష్యం లో , ఇప్పటి వరకు 1,12,555 ఎకరాలు సేకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కి సంబంధించిన నీటి నిల్వ అంశాలను తెలుపుతూ, ఫేజ్ 1 లో 17 మీటర్లు ఎత్తులో  6.88 టీఎంసీ సామర్ధ్యం నీటి ని, ఫేజ్ 2 లో  25.72 మీటర్లు ఎత్తులో 23.44  టీఎంసీ సామర్ధ్యం నీటిని,  ఫేజ్ 3 లో 41.15 మీటర్లు ఎత్తులో 115.44 టీఎంసీ సామర్ధ్యం నీటిని,  ఫేజ్.4 లో  45.72 లో  మీటర్లు ఎత్తులో 191.68 టీఎంసీ సామర్ధ్యం నీటి ని నిలువ చెయ్యవొచ్చు నని తెలిపారు.  పునరావాసం కింద  41 కాంటూర్ పరిధిలో 20978 ఇళ్ళు నిర్మాణం చేపట్టవలసిన ఉందని, ఫేస్.1 కింద చేపట్టాల్సిన 3780 ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని పూర్తి చేసి, సంబంధించిన నిర్వాసితులను తరలించామన్నారు. ప్రభుత్వం నిర్మించే ఇళ్ళ కోసం13,938  ఆప్షన్ ఇచ్చారని , అందులో 2426 మంది ని పునరావాస ప్రాంతాలకు తరలించామన్నారు. స్వంతంగా ఇళ్ళు నిర్మాణం కోసం, వన్ టైమ్ సేట్టిల్మెంట్ కోసం 3225 మంది అంగీకారాన్ని తెలిపారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాస కాలనీ లలో మౌలిక వసతులు విద్యుత్,  కల్పించాలని, వారికి ఉపాధి, వైద్య, ఆరోగ్య విద్య తదితర అంశాలపై నిబద్ధతతో ఉందని పేర్కొన్నారు.


ఈ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తో కలిసి అనీల్ కుమార్ ఝా తదితరులు దేవిపట్నం, పూడిపల్లి గ్రామాలకు, గండిపోచమ్మ గుడికి రాష్ట్ర పర్యటన సంస్థ బోట్ పై వెళ్లారు. 


పీపీఏ (పబ్లిక్ ప్రోక్యూర్మెంట్ యాక్ట్) సీఈ ఏ కె  ప్రధాన్ ,  రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, కమిషనర్ (ఆర్ అండ్ ఆర్)  చెరుకూరి  శ్రీధర్, ఐ టి డి ఏ పిఓ. ఓ. ఆనంద్, ఆర్డీవో వై.వి.ప్రసన్న లక్ష్మీ,  ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ సుధాకర్ బాబు,  ఎస్ ఈ నరసింహమూర్తి,    డి ఎస్పీ కె. లతా కుమారి, తదితరులు ఉన్నారు.