పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది



కొవ్వూరు (ప్రజా అమరావతి);  


పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది




కొవ్వూరు డివిజన్ పరిధిలోని పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాపవరం, మల్లేశ్వరం గ్రామాల్లో రెండు వార్డు లకి నవంబర్ 14 ఆదివారం  ఉదయం 7.00 నుంచి మ. 1.00  గంట వరకు ఓటింగ్ ప్రక్రియ  జరుగుతుందని రెవెన్యూ డివిజనల్  అధికారి ఎస్. మల్లిబాబు శనివారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాల కు మెటీరియల్ తో చేరినట్లు తెలిపారు.


ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద  మ.1.00 కి  క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతిస్తామని తెలిపారు. 


రాష్ట్ర ఎన్నికల కమిషన్,  జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జోనల్ అధికారులు, ఫ్లయింగ్ , స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు పనిచేస్తున్నారన్నారు. ప్రతి బూత్ లోను వెబ్ కాస్టింగ్ కి సంబంధించిన లింక్ ను ఎంపీడీఓ లకు తెలియ చెయ్యడం జరిగిందన్నారు.



కొవ్వూరు లో కాపవరం గ్రామంలో 9వ వార్డుకి ఇద్దరు అభ్యర్థులు  గోతం మేరీ ఝాన్సీభాయ్, మొహమ్మద్ ఫసి ఉల్లా బేగ్ లు పోటీ లో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓట్లు 213 కాగా పురుషులు 111, మహిళలు 102 మంది ఉన్నారు. ఎంపిపి స్కూల్ లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 


పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామం 8 వ వార్డు ఎన్నికకు ఇద్దరు అభ్యర్థులు కె.సాంబశివరావు, జీ. నాగార్జున పోటీలో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓట్లు 213 కాగా పురుషులు 108, మహిళలు 105 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రం గ్రామ పంచాయతీ కమ్యూనిటీ హాల్ ఉత్తరం గదిలో ఓటింగ్ ప్రక్రియ కి ఏర్పాట్లు పూర్తి చేశారు.


14 వ తేదీన ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మ. 2 గంటల నుంచి ఓట్లు లెక్కింపు నిర్వహించి ఫలితాలను ఎన్నికల అధికారి ప్రకటిస్తారని మల్లిబాబు తెలిపారు.



Comments