ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ లకు రావలసిన నిధులపైన ప్రధానంగా చర్చ.




న్యూఢిల్లీ (ప్రజా అమరావతి);


కేంద్ర పోర్టులు, ఓడరేవులు, వాటర్ వేస్ మంత్రి సబరనాథ్ సోనోవల్ ని కలిసిన మంత్రి మేకపాటి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ లకు రావలసిన నిధులపైన ప్రధానంగా చర్చ.


గతంలో ఈ శాఖలకు కేంద్ర మంత్రిగా మనుసుఖ్ మాండవీయ ఉన్న నేపథ్యంలో ప్రస్తుత సోనోవల్ కి ఏపీ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికను మరోసారి వివరించిన మంత్రి గౌతమ్ రెడ్డి.

3 పోర్టులు, 11 ఫిషింగ్ హార్బర్ లకు అందించాల్సిన నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం  సానుకూల స్పందన.రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీలో మేజర్ పోర్టును గుర్తించి నివేదిక అందించాలన్న కేంద్ర మంత్రి సోనోవల్

ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన గత రెండున్నరేళ్ల కాలంలో ఏపీ మారిటైమ్ బోర్డును స్థాపించి, ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా కోస్టల్ కారిడార్ డెవలప్ మెంట్ చేశామన్నది కేంద్ర మంత్రికి వివరించిన మంత్రి మేకపాటి.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకనమిలో ఏపీ ఏ విధంగా కీలకంగా వ్యవరిస్తుందన్న దానిపై కూలంకషంగా చర్చించిన మంత్రి మేకపాటి.

సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం 2030 కల్లా ప్రస్తుతం 4 శాతంగా ఉన్న ఎగుమతులను 10శాతం లక్ష్యంతో ముందుకెళుతోందని కేంద్ర మంత్రి సోనోవల్ కి మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడి.

ఎగుమతులకు సంబంధించిన వాణిజ్య ఉత్సవం - 2021ని విజయవంతంగా నిర్వహించామని స్పష్టం చేసిన మంత్రి మేకపాటి.ఏపీ కొత్తగా చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకూ సహకరిస్తామని కేంద్ర మంత్రి వెల్లడి.

కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ రెసిడెన్స్ భవన్ కమిషనర్ భావనా సక్సేనా,  మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్,పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్ తదితరులు.