బుచ్చిరెడ్డిపాలెం నవంబర్ 17 (ప్రజా అమరావతి);
నెల్లూరు నగర పాలక సంస్థ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా కొనసాగుతుందని జిల్లా కలేక్టరు శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు తెలిపారు.
బుధవారం బుచ్చిరెడ్డిపాలెం డిఎల్ ఎన్ ఆర్ కాలేజీ లో జరుగుతున్న బుచ్చి నగర పంచాయితీ ఎన్నికల ఓట్ల లేక్కింపు కార్యక్రమం ను జిల్లా కలేక్టరు శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పరిశీలించారు. లెక్కింపు ప్రక్రియ వివరాలను బుచ్చి నగర పంచాయతీ కమిషనర్ శ్రీ వి శ్రీనివాసరావు కలెక్టర్కు వివరించారు. అనంతరం జిల్లా కలేక్టరు పాత్రికేయుల తో మాట్లాడుతూ ఉదయం 8గంటల కు అబ్జర్వర్,కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో లెక్కింపు ప్రక్రియ మొదలైందని , ఇప్పటికే మూడు వార్డులు ఫలితాలు వెల్లడయ్యాయని, మధ్యాహ్నం నకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి మొత్తం 20 వార్డుల ఫలితాలు వెల్లడవుతాయని కలెక్టర్ తెలిపారు.
addComments
Post a Comment