వరద ప్రాంతాలలో కాకాణి పర్యటన

 *" వరద ప్రాంతాలలో కాకాణి పర్యటన


"*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలైన కురిచెర్లపాడు, ఇస్కపాళెం, కాకుటూరు గ్రామాల్లో పర్యటించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
 భారీ వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాల కాలనీలలోని ప్రజలందరికీ పునరావాస కేంద్రాలలో బస ఏర్పాటు చేశాం.


 ప్రభుత్వ ఆదేశాల మేరకు వరదల్లో నష్టపోయిన వారందరికీ సహాయం అందజేస్తాం.


 ఇళ్లు కోల్పోయిన నిరుపేదలకు పక్కా ఇల్లు మంజూరు చేయించి నిర్మిస్తాం.


 సర్వేపల్లి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు నిర్మించడంతో గ్రామాలలోని అంతర్గత రోడ్లు బురదమయం కాకుండా ప్రజలకు ఎంతో ఊరట కలిగింది.


 గ్రామాలలో నిర్మించిన సైడు  డ్రైన్ల వల్ల వరద నీరు ఇళ్లలోకి రాకుండా నివారించగలిగాం.


 పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్న వారందరికీ భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నాం.


 పునరావాస కేంద్రాలలో ఉన్నవారందరికీ అవసరమైతే తక్షణ వైద్య సహాయం అందించేందుకు మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాం.


 గ్రామాల్లో నీరు నిల్వ ఉన్నందున అంటురోగాలు ప్రబలకుండా వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు సమన్వయంతో పని చేస్తున్నారు.


 ఇళ్లలో నీరు చేరుకున్న వారికి అవసరమైనన్ని రోజులు పునరావాస కేంద్రాలలో సకల సౌకర్యాలు కల్పిస్తాం.


 రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చెరువులు, కాలువలు, వాగులకు గండ్లు పూడిపించి సాగునీరు అందిస్తాం.


 నష్టపోయిన రైతాంగానికి సబ్సిడీతో విత్తనాలు అందించడంతోపాటు ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తాం.


 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.