రైతులతో కాకాణి పర్యటన"

 "రైతులతో కాకాణి పర్యటన"
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా(ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో రిజర్వాయర్, చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాలను రైతులు, ప్రజలతో కలిసి సందర్శించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
 భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సహాయక చర్యలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు.

 చెరువులు, రిజర్వాయర్లు కోతకు గురికాకుండా, రైతులకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం.

సర్వేపల్లి రిజర్వాయర్ 2014లో కురిసిన భారీ వర్షాలకు ప్రమాదపు అంచున చేరుకుంది.

 సర్వేపల్లి రిజర్వాయర్ ను గురించి తెలుగుదేశం 5 సంవత్సరాల కాలం పట్టించుకోకుండా, ఎన్నికలకు ముందు ఓట్ల కోసం హడావుడిగా జీవో జారీ చేసి చేతులు దులుపుకున్నారు.తెలుగుదేశం పార్టీ ప్రమాద బారిన పడే అవకాశం ఉన్న సర్వేపల్లి రిజర్వాయర్ నే పట్టించుకోలేదంటే, రైతాంగం పట్ల వారి శ్రద్ధ అర్థమవుతుంది.

వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, రిజర్వాయర్ మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయించి, పనులు ప్రారంభించాం.రాబోవు రబీ సీజన్ కల్లా, సర్వేపల్లి రిజర్వాయర్ కు మరమ్మతులు పూర్తి చేసి, పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉంచేలా చర్యలు చేపడతాం.

భారీ వర్షాల నేపథ్యంలో తిక్కవరపుపాడు చెరువుకి గండిపడినా, ఒక్క సెంటు పొలం కూడా నష్టపోకుండా తక్షణ చర్యలు చేపట్టాం.సర్వేపల్లి నియోజకవర్గ రైతాంగానికి చెరువులకు, కాలువలకు పడిన గండ్లు పూడ్చివేసి, సజావుగా, సాఫీగా సాగునీరందిస్తాం.

భారీ వర్షాలతో నష్టం వాటిల్లిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం.మరో భారీ వర్ష సూచన నేపథ్యంలో అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image