ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) సీఎండీ సంజయ్‌ మల్హోత్రా (ఐఏఎస్‌), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సీఎండీ డాక్టర్‌ ఆర్‌ ఎస్‌ ధిల్లాన్‌ (ఐఏఎస్‌).


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) సీఎండీ సంజయ్‌ మల్హోత్రా (ఐఏఎస్‌), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సీఎండీ డాక్టర్‌ ఆర్‌ ఎస్‌ ధిల్లాన్‌ (ఐఏఎస్‌).



ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) సీఎండీ సంజయ్‌ మల్హోత్రా (ఐఏఎస్‌) మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే...


ఇవాళ చక్కటి సమావేశాలు జరిగాయి, గౌరవ ముఖ్యమంత్రితోపాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ కార్యదర్శిలతో సమావేశాలు నిర్వహించాం. మేం చాలా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాం. ఆర్డీఎస్‌ఎస్‌పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించాం, ఈ పథకంపై చర్చించాం. లిక్విడిటీ ఇన్‌ఫ్యూజన్‌పైకూడా మాట్లాడుకున్నాం. విద్యుత్‌రంగంపై చర్చించాం. ఏపీలో విద్యుత్‌పంపిణీ సంస్థలు.. డిస్కంలు మంచి సమర్థత చూపిస్తున్నాయి. ఆర్డీఎస్‌ఎస్‌పై కార్యాచరణ రూపొందించుకుని ఆ పథకం నుంచి ప్రయోజనం  పొందాలన్నారు.


ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Comments