ప్రపంచ పరిశోధకుల జాబితాలో కె ఎల్ విశ్వవిద్యాలయ డాక్టర్ కాకర్ల హరి కిషోర్

 *ప్రపంచ పరిశోధకుల జాబితాలో కె ఎల్ విశ్వవిద్యాలయ డాక్టర్ కాకర్ల హరి కిషోర్*


తాడేపల్లి (ప్రజా అమరావతి);

ప్రపంచ వ్యాప్తంగా అగ్రసేని పరిశోధన జాబితాలో  కె ఎల్ విశ్వవిద్యాలయం ఈసీఈ భాగానికి చెందిన డాక్టర్ కాకర్ల హరి కిషోర్ కు చోటు దక్కిందని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ వై.వి.ఎస్.ఎస్.ఎస్.వి ప్రసాద్ రావు మంగళవారం  ఒక ప్రకటనలో తెలిపారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, ఎలెవియర్ , సైటెక్ స్ట్రాటజీస్ సంస్థలకు చెందిన జెరోయాన్ బాస్ , కెవిన్ బొయాక్ , జాన్ పి.ఎ.లాన్నిడిస్ ఆధ్వర్యంలో ప్రపంచంలో విద్యాపరంగా ఉత్తమ పరిశోధకుల జాబితాను రూపొందించారని అన్నారు. భారతదేశం నుంచి సబ్జెక్టుల వారీగా టాప్ 2 శాతం జాబితాలో చోటు సంపాదించారని అన్నారు. ఇంతటి విజయాన్ని సాధించిన డాక్టర్ హరి కిషోర్ ను విశ్వవిద్యాలయ యాజమాన్యం, కులపతి డాక్టర్ ఎస్ ఎస్ మంతా, ఉపకులపతి డాక్టర్ సారధి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్.వెంకట్రామ్, వివిధ విభాగాల డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు,విద్యార్థులు అభినందించారు.