ఎయిడెడ్ విద్యా సంస్థలకు అప్షన్లు పెంచిన ప్రభుత్వం

 *ఎయిడెడ్ విద్యా సంస్థలకు అప్షన్లు పెంచిన ప్రభుత్వం* 


*గతంలో ఎంచుకున్న అప్షన్ లను మార్పు చేసుకునే అవకాశం*

 


: *డీఈవో శామ్యూల్* 


అనంతపురం, నవంబర్ 14 (ప్రజా అమరావతి):


*ప్రభుత్వంలో ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనానికి సంబంధించి ఎయిడెడ్ విద్యాసంస్థలకు మరింత స్వేచ్ఛను కల్పిస్తూ ప్రభుత్వం మెమో విడుదల చేసిందని డీఈవో శామ్యూల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.*


 జిల్లాలోని ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలు గతంలో వారు స్వచ్ఛందంగా ఇచ్చిన ఐచ్చికాన్ని పునఃపరిశీలించుకునేందుకు, గతంలో స్పందించని యాజమాన్యాలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. ఇందులో భాగంగా నాలుగు రకాల ఆప్షన్లు ఇచ్చి దాని నుంచి ఏదైనా ఒక ఆప్షన్ ని విద్యాసంస్థలు ఎంచుకోవచ్చన్నారు.

 

*ఎయుడెడ్ విద్యాసంస్థలకు సంబంధించి డీఈఓ శామ్యూల్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఐచ్ఛికాల వివరాలు*

1. ఆస్తులు మరియు సిబ్బంది తో సహా వారి సంస్థలు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా సరెండర్ చేయుటకు అంగీకారం తెలుపుట.

2. ఆస్తులు మినహా సిబ్బందితో సహా ఎయిడెడ్ పోస్టులను మరియు ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా సరెండర్ చేయుటకు అంగీకారం తెలుపుత మరియు ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలగా కొనసాగుట.

3. ప్రస్తుతం అమలులో నియమ నిబంధనలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్ మొదలగు వాటిని కొనసాగిస్తూ ఐచ్చికాలు 1&2 లకు అంగీకారం తెలపకుండా ప్రైవేటు ఎయిడెడ్ సంస్థలుగానే యధాతథంగా కొనసాగడం.

4. గతంలో ఐచ్చికం 1 లేదా 2 లకు అంగీకారం తెలిపినప్పటికీ సరెండర్ చేయబడిన సిబ్బందిని వెనుకకు తీసుకుని ప్రైవేట్ ఎయిడెడ్ సంస్థగానే కొనసాగుదలుచుకొనుట.


ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని రాతపూర్వకంగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి, జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి కార్యాలయానికి, డిగ్రీ కళాశాలల ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయానికి తెలియజేయాలని డిఈఓ సూచించారు.



ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు, ఎయిడెడ్ జూనియర్ 

కళాశాలలు, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ప్రభుత్వం విడుదల చేసిన మెమోను ఉపయోగించుకోవాలని డిఈఓ విజ్ఞప్తి చేశారు.


Comments