అమరావతి (ప్రజా అమరావతి);
*ఢిల్లీ పర్యటనకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
రాష్ట్ర ప్రగతికి సంబంధించి గతంలో చర్చించిన ప్రాజెక్టుల ఫాలో అప్, కొత్త అభివృద్ధి అంశాలపై చర్చే ప్రధాన అజెండా
11,12 తేదీలలో మంత్రి మేకపాటి ఢిల్లీ పర్యటన
కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య, ఎమ్ఎస్ఎమ్ఈ, పోర్టులు, విద్యుత్, ఓడరేవుల శాఖల మంత్రులు సహా వల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ లను కలవనున్న మంత్రి మేకపాటి
ఈ నెల 19న మరోసారి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఐ.టీ, విమానయాన, శాఖ మంత్రులను కలిసే అవకాశం
రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను సంబంధిత శాఖల కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లేందుకు సన్నద్ధమైన ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి
రాష్ట్రానికి రావలసిన నిధులు సహా పలు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించనున్న మంత్రి మేకపాటి
మంత్రి మేకపాటి వెంట ఢిల్లీ పర్యటనకు ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్, తదితరులు
addComments
Post a Comment