వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం అంశాన్ని ఒడిశా సీఎంతో రేపు జరిగే చర్చల్లో ప్రస్తావించనున్న ఏపీ సీఎం.



రేపు (09–11–2021) ఒడిశాతో చర్చల నేపథ్యంలో అధికారులతో ముఖ్యమంత్రి సన్నాహక సమావేశం.


క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌


–రేపు భువనేశ్వర్‌ వెళ్లనున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

–ఉభయరాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై రేపు సాయంత్రం ఒడిశా సీఎం శ్రీ నవీన్‌ పట్నాయక్‌తో చర్చలు.

–ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో సీఎం సన్నాహక సమావేశం.

–మూడు అంశాలపై ఒడిశా సీఎంతో చర్చించనున్న ఏపీ సీఎం.

*–వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలపై చర్చించనున్న సీఎం.*


*ఈ అంశాలకు సంబంధించి అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం.*


అమరావతి (ప్రజా అమరావతి);

– వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం అంశాన్ని ఒడిశా సీఎంతో రేపు జరిగే చర్చల్లో ప్రస్తావించనున్న ఏపీ సీఎం. 


– నేరడి బ్యారేజీ కారణంగా ఉభయ రాష్ట్రాలకూ కలగనున్న ప్రయోజనాలను వివరించనున్న సీఎం.

– బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా వైపునుంచి 103 ఎకరాలు అవసరమని ఇందులో 67 ఎకరాలు రివర్‌బెడ్‌ ప్రాంతమేనన్న అధికారులు

– బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశావైపు కూడా సుమారు 5–6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని తెలిపిన అధికారులు


– జంఝావతి ప్రాజెక్టు అంశాన్ని రేపటి సమావేశంలో ప్రస్తావించనున్న సీఎం.

– ప్రస్తుతం రబ్బర్‌ డ్యాం ఆధారంగా సాగునీరు ఇస్తున్నామని తెలిపిన అధికారులు.                        

- 24,640 ఎకరాల్లో కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామని తెలిపిన అధికారులు

– ప్రాజెక్టు పూర్తిచేస్తే రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని తెలిపిన అధికారులు

– ప్రాజెక్టును పూర్తిచేస్తే ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా 6 గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలిపిన అధికారులు.

– ఒడిశాలో దాదాపు 1174 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని తెలిపిన అధికారులు. ఇందులో 875 ఎకరాలు ప్రభుత్వ భూమేనని తెలిపిన అధికారులు.

–ఆర్‌ అండ్‌ ఆర్‌కు సహకరించాలని ఒడిశాను కోరనున్న ఏపీ.


–కొఠియా గ్రామాల వివాదానికి సంబంధించిన మొత్తం వివరాలను సీఎం ముందు ఉంచిన అధికారులు

– కొఠియా గ్రామాల్లో ఇటీవల పరిణామాలను వివరించిన అధికారులు.

– 21 గ్రామాల్లో 16 గ్రామాలు ఏపీతోనే ఉంటామంటూ తీర్మానాలు చేసి ఇచ్చారని సీఎంకు వివరించిన విజయనగరం జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారి

– ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించామని సమావేశంలో పేర్కొన్న అధికారులు

– కొఠియా గ్రామాల్లో దాదాపు 87శాతానికి పైగా గిరిజనులు ఉన్నారని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సమావేశంలో ప్రస్తావించిన అధికారులు


ఈ సమావేశంలో సీఎస్‌ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, జలవనరులశాఖ ఈఎన్‌సి సి నారాయణరెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఎ సూర్య కుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments