నృసింహుని ఆలయానికి ఆర్ జే సి హోదా కల్పనకు వెనుకాడేది లేదు.

 *నృసింహుని ఆలయానికి ఆర్ జే సి హోదా కల్పనకు వెనుకాడేది లేదు.*


*స్వామి వారి ఆస్తుల రక్షణకు చర్యలు*

*ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)* 



మంగళగిరి,(ప్రజా అమరావతి); మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానానికి ఆర్ జే సి హోదా కల్పించే విషయంలో ఏ మాత్రం వెనుకాడబోమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) స్వష్టం చేశారు.

శనివారం సాయంత్రం దిగువ సన్నిధి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగిన భగవద్గిత పారాయణం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.స్వామి వారి ఆదాయం పెరిగినా నృసింహుని ఆలయం నేటికి ఆర్ జే సి హోదాకు నోచుకోలేదని  విలేఖరులు ప్రస్తావించగా ఎమ్మెల్యే ఆర్కే స్పందిస్తూ,చట్ట ప్రకారం ఆలయానికి ఆర్ జే సి హోదా దక్కేందుకు ఉండాల్సిన నియమ నిబంధనలేమిటి అనేది పరిశీలిస్తానని  తెలిపారు.హోదా పెంపునకు చర్యలు తీసుకుంటానని స్వష్టం చేశారు.


దాతలే వీఐపీలు,

జాబితా ప్రకారం స్వామి వారి స్థిర,చరాస్తుల  రక్షణకు ఆలయ అధికారుల సహకారంతో అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.ఇందులో భాగంగా కాజ గ్రామంలో ఆక్రమనలో ఉన్న 50 సెంట్లు,హైవే వెంబడి ఉన్న అతి విలువైన 2 ఎకరాల 20 సెంట్ల భూమిని కాపాడగలిగామని అన్నారు. స్వామి వారికి భూములు  కానుకగా సమర్పించిన దాతల వివరాలు సేకరించి ముక్కోటి ఏకాదశి నాడు ఇచ్చే శంఖు తీర్థం కార్యక్రమానికి వారిని విఐపిలుగా ఆహ్వానించాలని నిర్ణయించామని అన్నారు.రాజకీయ నాయకులకు విఐపి దర్శనం కల్పించే పద్ధతికి స్వస్తి పలకాలని  లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల సహకారం తో దేవస్థానాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.చీకటి కొనేరును శుభ్ర పరుస్తుండగా పంచ లోహ విష్ణు మూర్తి విగ్రహాలు లభ్యమయ్యాయని ఆవి మట్టిలో ఉండటం సరి కాదని ఉద్దేశంతో ఆలయంలోని ఆల్వర్ గదిలో ప్రతిష్టింపజేశామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ,ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Comments