జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాల



ఏలూరు, (ప్రజా అమరావతి);


      జిల్లాలో  వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా  ఒక ప్రకటన లో ఆదేశించారు. 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో వర్షాల నేపథ్యంలో అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ లో 1800-233-1077,సబ్ కలెక్టర్ నరసాపురం  లో 8688113733,  ఆర్ డి ఓ  జంగారెడ్డిగూడెం లో 9640170352 , ఆర్డీఓ కొవ్వూరు కార్యాలయంలో లో 08813- 231488, ఏలూరు ఆర్డీఓ   కార్యాలయాలలో   08812-232044 /  8500667696  , ఆర్డీఓ  కుక్కనూర్   కార్యాలయంలో లో 08821-232221, తాసిల్ దార్  మొగల్తూరు కార్యాలయంలో ల

 9491041466 , తాసిల్ దార్ నరసాపురం కార్యాలయంలో  08814- 275048 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బంది కలిగినా ప్రజలు ఫొన్చేసి తెలియ చేయాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాలను పరిశీలన చేయాలన్నారు. క్షేత్రస్థాయి అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. వర్షాల వల్ల రోడ్ల మధ్యలో దెబ్బతిన్న కల్వర్టులను పరిశీలించాలని, అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, రాకపోకలకు ఆటంకం కలుగకుండా  ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలంతా నీటిని వేడి చేసి తాగాలని చెప్పాలని, ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు.   లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 



Comments