నెల్లూరు నవంబర్ 22 (ప్రజా అమరావతి):
తెలుగు నాట అన్నమయ్య ,పురంధర దాసు ల మాదిరిగానే కన్నడంలో భక్త కనకదాసు గొప్ప వాగ్గేయకారుడని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి. చిన్న ఓబులేసు అన్నారు .పదిహేనవ శతాబ్దానికి చెందిన భారతీయ తత్వవేత్త, సంగీతకారుడు, కవి అయినటువంటి భక్త కనకదాసు జయంతి ఉత్సవం
కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ జయంతోత్సవం లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి. చిన్న ఓబులేసు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాలలతో డి ఆర్ ఓ అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి. చిన్న ఓబులేసు మాట్లాడుతూ భక్త కనక దాసు శ్రీకృష్ణదేవరాయల గురువులైన వ్యాసరాయలు కు సమకాలికులని అన్నారు. 2008 నుండి కర్ణాటక ప్రభుత్వం భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి ఉత్సవాలు నిర్వహిస్తుందని, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర వేడుకగా ప్రకటించినందున ఈ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు వరదలు పై గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నందున కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని, అందరికీ వారి శుభాకాంక్షలు అందజేశారని తెలిపారు. భక్త కనకదాసు భారతీయ ఇతిహాసానికి ఆత్మ వంటివారిని కొనియాడారు. సామాన్యులకు అర్థమయ్యే భాషలో రచనలు గావించి అందరికీ ఆప్తుడు అయ్యారని తెలిపారు. వారు రచించిన రచనలలో నల చరిత్ర ,హరిభక్తి సార ,మోహన తరంగిణి కన్నడ ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. భక్త కనకదాసు జీవిత చరిత్రను ప్రఖ్యాత కన్నడ నటుడు రాజ్ కుమార్ హీరోగా సినిమా తీశారని, అది ఎంతగానో ప్రజల ఆదరణ పొందిందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ భక్త కనకదాసు వారి గొప్పతనం ప్రజలందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉన్నదన్నారు. భారతీయ సంస్కృతి, నాగరికతను కర్ణాటక సంగీతం ద్వారా విశ్వవ్యాప్తం చేశారన్నారు. భారతీయులందరూ గర్వించదగ్గ గొప్ప వాగ్గేయకారుడిగా ప్రసిద్ధి పొందారన్నారు. ఈ సందర్భంగా జిల్లా బి.సి .వెల్ఫేర్ అధికారి శ్రీ వెంకటయ్య మాట్లాడుతూ ఉడిపి లోని శ్రీ క్రిష్ణ మందిరం తో భక్త కనకదాసు వారికి అవినాభావ సంబంధం ఉందని, కుల వివక్ష తీవ్ర స్థాయిలో ఉన్న ఆ రోజుల్లో తన సంగీతంతో శ్రీకృష్ణ దర్శన భాగ్యం పొందారని అన్నారు. ఈ సందర్భంగా కావలి సహాయ బి.సి .వెల్ఫేర్ అధికారి శ్రీ కె. సుధాకర్ మాట్లాడుతూ భక్త కనకదాసు ఆధ్యాత్మికతకు భారతీయ తత్వాన్ని మేళవించి బహుళ తత్వాన్ని ఆవిష్కరించిన గొప్ప సంగీతకారుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు అనధికారులు పాల్గొన్నా్నా
addComments
Post a Comment