జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన డా.కెఎస్.జవహర్ రెడ్డి.

 జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు  స్వీకరించిన డా.కెఎస్.జవహర్ రెడ్డి.అమరావతి,20 నవంబరు (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా డా.కెఎస్.జవహర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా ఉన్న డా.జవహర్ రెడ్డిని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 1930   ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా శనివారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకులో డా.కెస్ జవహర్ రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ టిటిడి ఇఓ గా అదనపు బాధ్యతల్లో కూడా డా.జవహర్ రెడ్డి  కొనసాగనున్నారు.