అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు.

 కొల్లిపర (ప్రజా అమరావతి)!      కృష్ణ పరివాహక ప్రాంతాల నుంచి అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవ




ని తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనన్ హెచ్చరించారు మండల పరిధిలోని కొత్త బొమ్మ వారి పాలెం ఇసుక రీచ్ నుంచి మంగళవారం రాత్రి అక్రమంగా ఇసుకను తరలించేందుకు సిద్ధంగా ఉన్నా 13 లారీలను మూడు జెసిబి లను రెండు కార్లను ఐదు మోటార్ బైక్ లను సీజ్ చేసినట్లు ఎస్సై బలరాం రెడ్డి తెలిపారు. అయితే  ఇదే రీచ్ లో సర్వేనెంబర్ 704, 705, 40సెంట్లలో జగనన్న కాలనీలలో మెరక తోలుకునేందుకు బుసకకు అనుమతినిచ్చారు. మంగళవారం రాత్రి ఇసుక క్వారీ లో లారీలు ఉన్నట్లు గమనించిన స్థానికులు ఇసుక గుత్తేదారు కంపెనీ జయప్రకాష్ పవర్ వెంచర్ అధికారులకు  సమాచారం ఇవ్వగా జెపి కంపెనీ అధికారులు ఎస్సై బలరాం రెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే ఎస్ఐ బలరాం రెడ్డి తన సిబ్బందితో ఇసుక రీచ్ లో దాడులు నిర్వహించారు సంఘటనా స్థలంలో వాహనాలను అదుపులోకి తీసుకొని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న తెనాలి సబ్ కలెక్టర్ నిధిమినన్ ఇసుక రీచ్ చేరుకొని ప్రదేశాన్ని  పరిశీలించారు .ఈ విషయాన్ని అధికారులును అడిగి తెలుసుకున్నారు. ఇసుక తరలింపు విషయమై ఎంక్వయిరీ చేసి నివేదికను పై అధికారులకు సమర్పిస్తామని ఆమె తెలిపారు. ఈ దాడులలో ఎస్ సి బి,సి. రవీంద్ర సుబ్రహ్మణ్యం, మైనింగ్ ఏ డి ఏ ప భూషన్ రెడ్డి, తాసిల్దార్ నాంచారయ్య అధికారులు పాల్గొన్నారు

Comments