అమరావతి (ప్రజా అమరావతి): సచివాలయంలో వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నత అధికారులతో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
*వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:*
– వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండండి: సీఎం
– వారిపట్ల మానవతా దృక్పథాన్ని చూపించండి:
– తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉదారత చూపించండి:
– 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె, కేజీ ఉల్లి, కేజీ పొటాటో, రూ.2వేలు ఇవ్వాలి:
– గ్రామాన్ని, వార్డును యూనిట్‌గా తీసుకోవాలి:
– వాలంటీర్ల సేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికీ సహాయం అందాలి:
– ముంపునకు గురైన ప్రతి ఇంటికీ ఈ పరిహారం అందాలి:
– ఎవ్వరికీ అందలేదన్న మాట రాకూడదు:
– సహాయక శిబిరాల్లో ఉన్న వారికి మంచి వసతులు, సదుపాయాలు కల్పించండి:
– వారికి అందించే సేవల్లో ఎక్కడా లోటు రానీయకూడదు:
– ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట వినిపించాలి:
– వారు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలి:
– విద్యుత్‌పునరుద్ధరణ, రక్షిత తాగునీటిని అందించడం యుద్ధ ప్రాతిపదికన చేయాలి, దీనిమీద ప్రత్యేక దృష్టి పెట్టాలి:
– 104 కాల్‌సెంటర్ ఇప్పటికే ప్రజలందరికీ పరిచయం ఉంది:
– ఈ నంబర్‌కు విస్తృత ప్రచారం కల్పించండి:
– వరదలకు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా.. ఈ నంబర్‌కు సమాచారం ఇవ్వమని చెప్పండి:
– 104కు ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే అధికారులు స్పందించి... బాధితులకు తోడుగా నిలవాలి:
– జిల్లాల్లో 104కు ప్రత్యేక అధికారిని నియమించండి:
– పారిశుద్ధ్యం, వైద్య శిబిరాల నిర్వహణపై దృష్టిపెట్టండి:
– ఎక్కడ అవసరమవుతుందో.. అక్కడ పెట్టండి, ఒక డ్రైవ్‌లా చేయండి:
– రోడ్లను పునరుద్ధరించడంపై ప్రత్యేక దృష్టిపెట్టండి:
– రవాణా సాగేలా ముందు తాత్కాలిక పనులు వెంటనే చేయాలి:
– శాశ్వతంగా చేయాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించాలి:
– ఇప్పుడు వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని ఆమేరకు డిజైన్లు రూపొందించి శాశ్వత పనులు చేపట్టాలి:
– వచ్చే నాలుగు వారాల్లో టెండర్లను ఖరారుచేసి... పనులు మొదలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి:
– పంచాయతీరాజ్, మున్సిపల్‌విభాగాలు దీనిపై చర్యలు తీసుకోవాలి:
– ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా..వారికి వెంటనే నగదు ఇవ్వండి :
– పూర్తిగా ఇళ్లు ధ్వంసం అయిన వారికి రూ. 95,100 డబ్బు ఇవ్వండి:
– దీంతోపాటు ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరుచేయండి:
– దీనివల్ల వెంటనే పనులు మొదలుపెట్టగలుగుతారు:
– పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ. 5200 నగదు వెంటనే అందించేలా చూడాలి:
– ప్రాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికే 90శాతం మేర నష్టపరిహారం అందించారు:
– మిగిలిన వారికి వెంటనే అందించేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలి:
– చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తోడుగా నిలవండి:
– నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి తోడుగా ఉండండి:
– వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోండి:
– ఆ కుటుంబాల పట్ల ఉదారంగా ఉండండి, రూ.25 లక్షల పరిహారం వారి కుటుంబాలకు అందించండి:
– విపత్తులో సహాయం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి... మిగిలిన వారిలో ధైర్యం నింపడానికే ఈ చర్యలు:
– వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి:
– మరణించిన పశువుల కళేబరాలవల్ల వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోండి:
– పశువుల ఆరోగ్యంపైనా దృష్టిపెట్టండి:
– వాక్సిన్లు సహా ఇతర చర్యలు తీసుకోండి:
*–పంటల నష్టం ఎన్యుమరేషన్ మొదలుపెట్టండి:*
– విత్తనాలు 80శాతం సబ్సిడీపై సరఫరా చేయండి:
– చెరువులు, ఇతర జలాశయాలు, కట్టల మీద దృష్టిపెట్టండి:
– నిరంతరం అప్రమత్తంగా ఉండండి:
– ఎప్పటికప్పుడు నివేదికలను అందించాలి:
*అప్రమత్తంగా ఉండాలి*
– బంగాళాఖాతంలో మళ్లీ వస్తున్న అల్పపీడనం తమిళనాడు దక్షిణ ప్రాంతానికి వెళ్తున్నట్టు చెప్తున్నారు:
– అయినా సరే చాలా అప్రమత్తంగా ఉండాలి:
– ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉండండి:
– కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సహాయ కార్యక్రమాల కోసం మరో రూ.10 కోట్లు చొప్పున, మొత్తంగా రూ.40 కోట్లను వెంటనే ఇస్తున్నాం:
– అధికారులు అంతా డైనమిక్‌గా పనిచేయాలి:
– ఎలాంటి సమస్య ఉన్నా.. నా దృష్టికి తీసుకు రండి:
– విద్యుత్ పునరుద్ధరణలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదు:
– సరిపడా సిబ్బందిని తరలించి అన్నిరకాల చర్యలు తీసుకోండి:
– వరద ముంపును పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా సంబంధించి సబ్‌స్టేషన్లను, కరెంటు సరఫరా వ్యవస్థను ముంపు లేని ప్రాంతాలకు తరలించాలి:
– పశువులకు దాణా కూడా అందించమని ఆదేశాలు జారీచేశాం:
– పశువులు మరణిసే... నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోండి:
– గండ్లు పడ్డ చెరువుల్లో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి:
– పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలి: అధికారులకు సీఎం శ్రీ వైయస్.జగన్ నిర్దేశం.
ఈ సమీక్షా సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, జలవనరులశాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, డిజాస్టర్ మేనేజిమెంట్ కమిషనర్ కె కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
addComments
Post a Comment