ఆచంట నియోజకవర్గ సీఎం కప్ ఆటలు పోటీలు

 ఆచంట (ప్రజా అమరావతి):  ఆచంట నియోజకవర్గ సీఎం కప్ ఆటలు పోటీలు గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు గారు 1-12-2021 బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మార్టేరు శ్రీ వేణుగోపాల ఉన్నత పాఠశాలలో ప్రారంభిస్తారని ఆచంట మండల అభివృద్ధి అధికారి మంగళవారం ఒక ప్రకటన లో  తెలియజేశారు ఈ పోటీల్లో భాగంగా  బాస్కెట్బాల్,  బాక్సింగ్ ,అథేలిటిక్స్, బ్యాడ్మింటన్ , తదితర  పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.  ఈ పోటీల్లో   గెలిచినవారు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అవుతారన్నారు. . ఈ కార్యక్రమంలో పలు పాఠశాలలు విద్యార్థులు పాల్గొంటారు. 

 ఆచంట పెనుమంట్ర, పెనుగొండ ,పోడూరు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమనికి హాజరు అవుతారు