జిల్లాలో వర్షాలు, వరదలు కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం సభ్యులు రెండు బృందాలుగా ఏర్పడి ఆదివారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.

 ల్లూూ


నెల్లూరు (ప్రజా అమరావతి);

జిల్లాలో వర్షాలు, వరదలు కారణంగా  జరిగిన నష్టాన్ని  పరిశీలించేందుకు  కేంద్ర బృందం సభ్యులు  రెండు బృందాలుగా  ఏర్పడి  ఆదివారం  జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. 


మొదటి  బృందం తిరుపతి నుండి రాగా,  రెండవ  బృందం కడప నుండి రావడం జరిగింది.  కడప నుండి బయలు దేరిన రెండవ బృందం సభ్యులు కునాల్ సత్యార్ది, అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ అఫైర్స్, డా. కె. మనోహరన్, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, కో ఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, శ్రీనివాసు బైరి, సూపరింటెండెంట్ ఇంజినీర్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, శివానీ శర్మ, డైరెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, సోమశిల అతిథి గృహంనకు చేరుకోగా,  జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు స్వాగతం పలికారు. 

అనంతరం కేంద్ర బృందం సభ్యులు   సోమశిల ప్రాజెక్ట్ ను  పరిశీలించడం జరిగింది. సోమశిల ప్రాజెక్టు సి.ఈ శ్రీ హరినారాయణ  రెడ్డి, ఎస్.ఈ  శ్రీ  రమణారెడ్డి   సోమశిల ప్రాజెక్టుకు సంబందించిన సమగ్ర వివరాలను   బృందం  సభ్యులకు తెలియచేశారు. 


అనంతరం సంగం మండల కేంద్రంలోని బీరాపేరు వాగు వద్ద దెబ్బతిన్న రోడ్డు, పంట పొలాలను, విద్యుత్ సరఫరా లైన్లను పరిశీలించారు.   వర్షాలు, వరదలు కారణంగా  ఈ ప్రాంతం తరచూ ముంపుకు గురై  పంటలు దెబ్బతిని రైతులు నష్ట పోవడం జరుగుచున్నదని,  శాశ్వత ప్రాతిపదికన  పొర్లుకట్ట నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని   ఈ సందర్బంగా ఆ ప్రాంత రైతులు  కేంద్ర బృందం  సభ్యులకు తెలిపారు.  ప్రస్తుతం వచ్చిన వరదలు కారణంగా సుమారు 600 ఎకరాలు పంట నష్టపోయామని రైతులు,  బృందం సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు.



తరువాత   బుచ్చిరెడ్డిపాలెం నుండి  జొన్నవాడ వరకు దెబ్బతిన్న ఆర్. అండ్ బి రోడ్డును కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఆర్ అండ్ బి శాఖ అధికారులు  రోడ్డు డ్యామేజి వివరాలు  బృందంకు వివరించారు. పెనుబల్లి గ్రామంలో   వరదలు కారణంగా పడిపోయిన  జడ్.పి. హై స్కూల్ ప్రహరీ గోడను, పశు వైద్యశాల ప్రహరీ గోడను  బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్బంగా  జడ్.పి  స్కూల్ వద్ద మరియు  పశు వైద్యశాల వద్ద  నష్టం వివరాలు తెలిసేలా ఏర్పాటు చేసిన  ఫోటో  బోర్డులను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు.  ఈ సంధర్బంగా  ఆ ప్రాంత వాసులు  వరదలు కారణంగా  ఇల్లు దెబ్బతిని నష్టపోవడం జరిగిందని   కేంద్ర బృందం సభ్యులకు  తెలిపారు.


 అనంతరం నెల్లూరు రూరల్ మండల పరిధిలో జొన్నవాడ  నుండి దేవరపాలెంకు వెళ్లే మార్గం మద్యలో   దెబ్బతిన్న ఆర్ అండ్ బి  రోడ్డును  కేంద్ర బృందం సభ్యులు  పరిశీలించారు. ఆర్ అండ్ బి శాఖ అధికారులు జరిగిన నష్టం వివరాలను కేంద్ర బృందం సభ్యులకు వివరించారు.


బృందం వెంట జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, ఆర్.డి.ఓ చైత్ర వర్షిణి, ఇరిగేషన్ శాఖ ఎస్.ఇ శ్రీ కృష్ణమోహన్, వ్యవసాయ శాఖ, ఆర్ అండ్ బి శాఖ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.



Comments