శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి):
ఈ రోజు సాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థానం నందు నిర్వహించిన కోటి దీపోత్సవము కార్యక్రమం నకు విచ్చేసిన పూజ్యులు శారదా రాజశ్యామల పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ గారు..
స్వామీజీ వారికి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస రావు గారు, ప్రిన్సిపల్ సెక్రెటరీ డా.జి.వాణీ మోహన్, IAS గారు, ఆలయ పాలకమండలి ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు, కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు మరియు పాలకమండలి సభ్యులు..
దీప ప్రజ్వలన తో కోటి దీపోత్సవం కార్యక్రమం ప్రారంభించిన స్వామీజీ గారు..
అనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవము కార్యక్రమం విశిష్టత ను గురించి అనుగ్రహ భాషణం చేసిన స్వామీజీ గారు..
శ్రీ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన స్వామీజీ గారు..
అనంతరం స్వామీజీ వారికి వేదస్వస్తి పలికిన ఆలయ స్థానాచార్యులు మరియు వేదపండితులు..
స్వామీజీ వారికి శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసిన మంత్రివర్యులు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆలయ ఛైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి వార్లు..
అనంతరం అందరికీ అనుగ్రహ భాషణం చేసిన స్వామీజీ వారు..
addComments
Post a Comment