తీర ప్రాంతాలలో కాకాణి పర్యటన

 *"తీర ప్రాంతాలలో కాకాణి పర్యటన


"* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలంలో సముద్ర తీర ప్రాంత గ్రామాలైన కొలనకొదురు, కట్టువపల్లి, పిడూరుపాళెం, వెంకన్నపాళెం గ్రామాల్లో పర్యటించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


సంగమేశ్వర దేవాలయ ప్రాంగణాన్ని, పరిసరాలను స్థానిక ప్రజలు, భక్తులతో కలిసి సందర్శించిన ఎమ్మెల్యే కాకాణి.


మనుబోలు సంగం యస్.టి.కాలనీకి పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు, సిమెంట్ డ్రైన్లు నిర్మించడంతో భారీ వర్షాల లో, వరదల్లో సైతం తమకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదని ఎమ్మెల్యేను కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేసి, ధన్యవాదాలు తెలియజేసిన యానాదుల కుటుంబాలు.
 భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి, సహాయక చర్యలు చేపట్టవలసిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


 తీరప్రాంత గ్రామాల ప్రజలు మరో భారీ వర్ష సూచన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.


 అధికారులు, నాతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతాం.


 రైతన్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని సాఫీగా సాగునీరు అందించేందుకు గండ్లు పూడ్చడంతో పాటు, ఇతర అవసరమైన మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేస్తాం.


 గ్రామాలలో పారిశుద్ధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించవలసిందిగా గ్రామపంచాయతీ సర్పంచులను, కార్యదర్శులను కోరాం.


 గ్రామాలకు వచ్చే రోడ్లను గుంటలు పూడ్చి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మరమ్మతులు చేయిస్తాం.


 భక్తులతో సంప్రదించి, ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతూ, పరశురాముడు స్థాపించినదిగా పేర్కొనబడుతున్న సంగమేశ్వర దేవాలయ పునర్నిర్మాణానికి చర్యలు చేపడతాం.


 సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు, సైడు డ్రైన్లు నిర్మించడంతో, వరదల్లో సైతం ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నివారించగలిగాం.


 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.