అనంతపురం కాలేజీ ఘటనపై తప్పుడు ప్రచారం : మంత్రి ఆదిమూలపు సురేష్



విజయవాడ (ప్రజా అమరావతి);



అనంతపురం కాలేజీ ఘటనపై తప్పుడు ప్రచారం : మంత్రి ఆదిమూలపు సురేష్


విద్యార్థుల ధర్నాలోకి కొందరు దుండగులు చొరబడ్డారు.. పోలీసులపై రాళ్ల దాడి చేశారు.  

దుండగుల రాళ్లదాడిలోనే విద్యార్థిని గాయపడింది. 

గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో ఎలాంటి పురపొచ్చాలు ఉన్నా.. వారి అందరితో చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. 

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. 


అనంతపురంలో కాలేజీ ఘటనపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. విద్యార్థుల ముసుగులో కొందరు దుండగులు ఈ ధర్నాలో చొరబడ్డారని, పోలీసులపై రాళ్లు రువ్వారని, విద్యార్థిని కూడా గాయపర్చారని మంత్రి అన్నారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో మంగళవారం మంత్రి సురేష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అనంతపురం కాలేజీ ఘటనపై ప్రతిపక్ష పార్టీ, కొన్ని పత్రికలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ వాస్తవ వివరాలను తెలిపారు.  

మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. సోమవారం నాడు అనంతపురం జిల్లాలో శ్రీసత్యసాయి బాబా నేషనల్ (SSBN) కాలేజీ ఆవరణలో జరిగిన ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అవాస్తవ ప్రచారానికి కొన్ని మీడియా సంస్థలు మద్దతు పలుకుతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలుగా చెప్పుకుంటున్న కొంత మంది విద్యార్థులను రెచ్చగొట్టారన్నారు. ఈ క్రమంలో వారు దాడికి పాల్పడ్డారని చెప్పారు. విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. విద్యార్థినిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, పోలీసులు లాఠీచార్జ్‌ చేయలేదంటూ జయలక్ష్మి అనే బాధిత విద్యార్థినే చెబుతోందని.. సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఆ అమ్మాయి స్వయంగా రికార్డు చేసిన వీడియోలో కూడా పోలీసులు ఎక్కడా కొట్టలేదని తెలిపిందని చెప్పారు. దుండగులు వేసిన రాళ్ల దాడిలోనే విద్యార్థిని గాయపడిందన్నారు. రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థల పనితీరుపై కమిటీ వేశామని.. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.. 

విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలు విద్యార్ధుల భవిష్యత్ తో ఆటలు ఆడుకోవడం ఎంతవరకూ సమంజసంమని మంత్రి ప్రశ్నించారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉండి.  40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ప్రతిపక్షం.. సరస్వతి పుత్రులపై దాడులంటూ సినీ ఫక్కీలో ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. 14 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ప్రైవేటీకరణ చేశారని.. ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం చేసింది ఆయన కాదా అన్నారు. ప్రతిపక్షం పరిపాలనా కాలంలో ఎప్పుడైనా ఎయిడెడ్ కాలేజీలపైన సమీక్షలు చేశారా అని ప్రశ్నించారు. 1999, 2006, 2017లో ఎయిడెడ్ పోస్టుల భర్తీ చేయడానికి వీలులేదని చెప్పింది గత ప్రభుత్వం కాదా..? యూనివర్సిటీలలో పోస్టులను రిజెక్ట్ చేసింది ఎవరో అందరికీ తెలుసునన్నారు. 

SSBN కాలేజీ ఘటనను ప్రాథమిక నివేదికగా తీసుకున్నామని మంత్రి వివరించారు. 1991 నుంచి స్కూల్, ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఈ ప్రాంగణంలో నడుస్తున్నాయన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను రద్దు చేసుకుంటున్నట్లు కాలేజీ యాజమాన్యం ప్రభుత్వానికి స్పష్టం చేసిందన్నారు. విద్యార్థులను,  తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తున్నారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్షం అనంతపురం ఘటనకు తెరలేపిందన్నారు. మొదట పేరేంట్స్ మీటింగ్ లు పెట్టి తల్లిదండ్రులను రెచ్చగొట్టారని, ఇఫ్పుడు విద్యార్థులతో చేయిన్నారని చెప్పారు. ఫీజులు పెరుగుతాయని విద్యార్థులతో చెప్పిస్తున్నారని.. ఫీజులు ఎక్కడా పెరగవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 90 శాతం కోర్సులు అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో.. 3 సంవత్సరాల పాటు హైయర్ ఎడ్యుకేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నిర్ణయించిన ఫీజులే కొనసాగుతాయన్నారు. ఫీజులు పెంచడం లేదా తగ్గించే అవకాశం ఎవరికీ లేదని అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు. జగనన్న విద్యా దీవెన కింద ప్రతి ఒక్క రూపాయి విద్యార్థికి ఫీజు రీఎంబర్స్ మెంట్ కింద తిరిగి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 

గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో ఎలాంటి పురపొచ్చాలు ఉన్నా.. వారి అందరితో చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి తెలిపారు. ఎయిడెడ్ కాలేజీలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగిస్తే.. వాటిని నాడు-నేడు కార్యక్రమం కింద పూర్తిగా అభివృద్ది చేస్తామన్నారు. ప్రతిపక్షం విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రైవైట్ యూనివర్సిటీ చట్టం చేసి ప్రభుత్వ భూములను ప్రైవేట్ వారికి గత ప్రభుత్వం ధారాదత్తం చేస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ చట్టంలో సవరణలు చేసి పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు కార్పోరేట్ సంస్థల్లో 30 శాతం సీట్లు కేటాయించి.. ఫ్రీగా చదువుకునేలా అవకాశ కల్పించారన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ధర్నాలు విద్యార్థులు, రాష్ట్రం కోసం కాదని.. విద్యా సంస్థలను టేకోవర్ చేయడానికి ఏమైనా కంపెనీయా...? అని, సంస్కరణల్లో భాగంగా  గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాలేజీలో కొన్ని అవకతవకలను గుర్తించామని, అడ్మిషన్లు గణనీయంగా పడిపోయాయని మంత్రి తెలిపారు. చాలా పోస్టులు ఖాళీగా ఉండడంతో. టీచర్స్, స్టూడెంట్స్ నిష్పత్తి లేని కారణం, మౌలిక సదుపాయాలే లేని కారణంగా, కొన్నిచోట్ల దారుణమైన పరిస్థితులున్నాయని... గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందుతున్నా కొన్ని చోట్ల పర్మినెంట్ భవనాలు లేకపోవడాన్ని కమిటీ గుర్తించిందని మంత్రి తెలిపారు. 400 స్కూళ్లకు పైగా జీరో అడ్మిషన్స్ ఉన్నాయని తెలిపారు. 


విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం ఈ ప్రభుత్వం కృషిచేస్తుందని.. అందులో భాగంగా ఇంగీష్ మీడియం ప్రవేశ పెట్టామని, బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ పెట్టామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని తెలిపారు. నిద్రపోతున్న వారిని లేపవచ్చు గానీ.. నిద్రిస్తున్నట్లు నటిస్తున్నవారిని ఎవరు లేపగలరని...? ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మంచివైనా కూడా ఏదోరకంగా మసిపూపి మారేడు కాయ చేయాలని అవాస్తవాలను ప్రచారం చేయాలనుకుంటున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పత్రికల్లో పోలీసుల లాఠీఛార్జ్ అని అసత్య ప్రచారాలు చేశారని,. విద్యార్థి సంఘాల ముసుగులో రాళ్లు రువ్వారని, పోలీసులపై చెప్పులు వేశారని... వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. 


ఉన్నత విద్యా శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర మాట్లాడుతూ... 1990 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలు తక్కువగా ఉండేవని, నాడు దాతలు, విద్యావేత్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విద్యా సంస్థలు నిర్వహిస్తే, ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ రూపంలో సాయం చేసేదని, 1990 తర్వాత గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో కొత్త విద్యాసంస్థల ఏర్పాటు జరగలేదని అన్నారు. 1990 తర్వాత ప్రైవేట్ రంగంలో విద్యా సంస్థలు ఏర్పాటు కావడంతో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యాసంస్థలను ఏర్పాటు చేశాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 45 వేలకు పైగా స్కూళ్లు ఉండగా, 6 వేల ప్రభుత్వ హైస్కూళ్లు ఉండగా, అందులో 434 ఎయిడెడ్ హైస్కూళ్లు ఉన్నాయన్నారు. 

రెండు దశాబ్ధాలుగా రాష్ట్రంలో కొత్తగా ఎయిడెడ్ స్కూళ్లు ఏర్పాటు కాలేదని, 1990 నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది.. నేడు కొత్తగా వచ్చింది కాదన్నారు. 1999 లో ప్రభుత్వ పరంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయకూడదని, ప్రభుత్వం విధానపరంగా ఒక నిర్ణయం తీసుకుందని ఇది కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం కాదన్నారు. ఈ అంశంలో ఒక కమిటీ వేసి, అధ్యయనం చేసిన తర్వాతే, నేటి పరిస్థితుల్లో ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు ఎకనమిక్ గా వైబల్ కాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 

అన్ ఎయిడెడ్ కోర్సుల గురించి, ప్రభుత్వం ఎక్కడ మాట్లాడలేదని, మూడేళ్ల పాటు ఒకే ఫీజు కమిషన్ నిర్ణయం మేరకు ఉంటున్నప్పుడు, ఫీజు పెరుగుతుందని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఇందుకు విరుద్ధంగా ఆయా విద్యాసంస్థలు క్యాపిటేటివ్ ఫీజు వసూలు చేస్తే, తగిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. ఒకవేళ ఫీజు పెరిగినా, జగనన్న విద్యాదీవెన ద్వారా పూర్తి ఫీజును రీయింబర్స్ మెంట్ ఇస్తామని, దీనివల్ల విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు నష్టమేమీ లేదన్నారు. ఎయిడెడ్ కాలేజీల్లో 3 దశాబ్ధాలుగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆ విద్యాసంస్థల్లో విద్యార్ధులుకు ఎవ్వరూ బోధన చేస్తారన్నారు. అన్ ఎయిడెడ్ సిబ్బంది, మేనేజ్ మెంట్, వ్యక్తిగతంగా మాట్లాడి, ప్రభుత్వానికి అప్పజెప్పుతామని చెబితే, ప్రభుత్వ కాలేజీగా నడపడంలో తప్పేముందన్నారు. 

ఒక హైస్కూళ్లు గానీ, ప్రైమరీ స్కూళ్లు గానీ నడవాలంటే కనీసం 100 మందైనా ఉండాలి కదా..? అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లలోని విద్యార్థుల వివరాలను సతీష్ చంద్ర వివరించారు.  .10 మంది లోపు ఉన్న స్కూళ్లలో ఎయిడెడ్ సిబ్బంది కూడా ఉన్నారని, అక్కడ ప్రభుత్వం జీతాలు ఇస్తుంది. ఇది ప్రజల సొమ్మే కదా..? అన్నారు. స్కూళ్లలో టీచర్లు ఒకటే కాదని సరైన గదుల, మంచి నీటి వసతి, ప్రహారీ గోడ, ఫ్యాన్లు, టాయిలెట్స్, ఫర్నీచర్ వంటి మౌలిక సదుపాయాలన్నీ ఉండాలన్నారు.  ప్రైమరీ స్కూళ్లలో చాలా చోట్ల త్రాగునీటి సౌకర్యం లేదన్నారు. 1-10 విద్యార్థులున్న హైస్కూళ్లు 28 ఉన్నాయన్నారు. 11-20 విద్యార్థులున్న వారు హైస్కూళ్లు 70, 21-30 విద్యార్థులున్న వారు హైస్కూళ్లు 81, 31-40 విద్యార్ధులున్న హైస్కూళ్లు 41, 41-50 విద్యార్ధులున్న హైస్కూళ్లు 20, 51-60 విద్యార్ధులున్న హైస్కూళ్లు 27, 61-70 విద్యార్ధులున్న హైస్కూళ్లు 32, 71-100 విద్యార్ధులున్న హైస్కూళ్లు 27, 101-200 విద్యార్ధులున్న హైస్కూళ్లు 73, 201-300 విద్యార్ధులున్న హైస్కూళ్లు 15, 301-400 విద్యార్ధులున్న హైస్కూళ్లు 14, 401-500 విద్యార్ధులున్న హైస్కూళ్లు 03, 501- ఆపైన 3 మొత్తం 434 ఎయిడెడ్ హైస్కూళ్లు ఉన్నాయని వివరించారు. అలాగే ప్రైమరీ స్కూళ్ల విషయంలో 1-10 విద్యార్థులున్న స్కూళ్లు 66 ఉన్నాయి. 11-20 విద్యార్థులున్నవి 132 ప్రీస్కూళ్లు ఉన్నాయన్నారు.  

మంచిగా నడిపే ఎయిడెడ్ స్కూళ్లు, వ్యవస్థ ఉంటే, మేము నిర్వహించవద్దని చెప్పడం లేదని,  ఎయిడెడ్ సంస్థలు సమర్ధవంతంగా నిర్వహించలేని పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వ పాఠశాల లేకపోతే, కొత్తగా ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తుందని, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగదన్నారు. విద్యార్ధులు, యాజమాన్యం, సిబ్బంది నుంచి ఏదైనా సమస్యలు ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉందన్నారు. 

పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Comments
Popular posts
రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ–క్రాపింగ్‌ చేయాలి:
Image
భారత త్రో బాల్ జట్టు కెప్టెన్ శ్రీ చావలి సునీల్ కి ఆర్థిక సహాయం క్రింద 25 లక్షల చెక్కును అందించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కే. రోజా
Image
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.
Image
దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్*
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image