వ్యవసాయంపై చర్చ సందర్భంగా శాసనసభలో ఘటనలపై సీఎం ఏమన్నారంటే...



వ్యవసాయంపై చర్చ సందర్భంగా శాసనసభలో ఘటనలపై సీఎం ఏమన్నారంటే...



అమరావతి (ప్రజా అమరావతి):

రైతులకు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు, ఒకవైపున వర్షాల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్న సందర్భాల్లో .. ప్రతిపక్షం వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలి:

పలానా మాదిరిగా చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పొచ్చు.

అలాంటి పరిస్థితిని పూర్తిగా పక్కనపెట్టేసి, ప్రజలు ఎలా ఉన్నా పర్వాలేదు, ప్రజలు ఎలా ఉన్నా అభ్యంతరం లేదు నా ఎజెండా రాజకీయ అజెండానే, ప్రతి అంశంలోనూ... నాకు రాజకీయ లబ్ధి జరగాలి, లబ్ధి చేకూక్చుకునేలా ప్రవర్తిస్తాను అనే ధోరణిలోకి చంద్రబాబుగారు వెళ్లిపోతారు:

ఆయన మాట్లాడిన తీరు, చేసిన డ్రామా అన్నీ కూడా మన కళ్ల ఎదుటే కనబడ్డాయి:

అది జరిగేటప్పుడు నేను సభలో లేను :

నేను సభకు రాకముందు కలెక్టర్లతో వర్షాలపై సమీక్షచేశాను:

సభకు వచ్చిన తర్వాత జరిగిన పరాణామాలేంటో తెలుసుకున్నాను:

నేను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారు:

చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు:

చంద్రబాబుకు పొలిటికల్‌ అజెండానే ముఖ్యం:

చంద్రబాబుమీద తాము వ్యతిరేకంగా ఉన్నామని తీర్పిచ్చారు:

ఊహించని విధంగా ప్రజల వ్యతిరేకత చూశారు:

మండలిలో కూడా వారికున్న బలం పూర్తిగా మారిపోయింది:

మండలిలో కూడా వైయస్సార్‌సీపీ బలం గణనీయంగా పెరిగింది:

కౌన్సిల్‌ ఛైర్మన్‌గా వైయస్సార్‌సీపీకి చెందిన నా సోదరుడు, దళితుడు రాబోతున్నాడు:

ఇవన్నీ తట్టుకోలేక చంద్రబాబు ప్రస్టేషన్‌లోకి వెళ్లిపోయారు:

ఏం మాట్లాడుతున్నారో? ఏం చేస్తున్నారో ఆయనకు అర్థంకావడంలేదు:

సంబంధంలేని టాపిక్‌ను చంద్రబాబు సభలోకి తీసుకొస్తారు:

దాన్ని ఖండిస్తూ అధికార పక్షంనుంచి కూడా కొంతమంది మాట్లాడతారు:

తానంతట తానే సభలో వాతావరణాన్ని చంద్రబాబు రెచ్చగొడతారు:

సహజంగానే దానికి స్పందిస్తూ అధికార పక్షంనుంచి మాట్లాడతారు:

చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా అలాంటి మాటలేవీ అధికారపక్షం నుంచి మాట్లాడలేదు:

మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రత్యారోపణలుగా నాడు టీడీపీ హయాంలో జరిగిన వంగవీటి మోహన రంగా గారి హత్య అయితేనేమి, మాధవరెడ్డిగారి హత్య అయితేనేమి, మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖపైకూడా చర్చజరగాలని అధికారపార్టీ సభ్యులు అన్నారు:

చంద్రబాబు రెచ్చగొడుగుతున్నారు కాబట్టే ఈమాటలన్నారు:

ఎక్కడా కూడా కుటుంబ సభ్యులగురించి అధికార పక్ష సభ్యులు మాట్లాడలేదు:

కుటుంబ సభ్యుల గురించి చంద్రబాబుగారు మాట్లాడారు తప్ప, ఇంకెవ్వరూడా కూడామాట్లాడలేదు:

మా చిన్నాన్న గురించి, మా అమ్మగురించి, మా చెల్లెలు గురించి చంద్రబాబే ప్రస్తావించారు:

అధికారపక్షంనుంచి అలాంటి ప్రస్తావన ఏమీ లేదు :

సభ రికార్డులు చూసినా ఇది అర్థం అవుతుంది:

మా వాళ్లు అందరూ కూడా ఇదే చెప్పారు:

వెళ్లిపోతూ, వెళ్లిపోతూ చంద్రబాబు శపథాలు చేశారు:

ఇవన్నీ మన కళ్లముందే చూశాం:

ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు :

నేను అయినా, ఎవరైనా అంతా నిమిత్త మాత్రులమే:

దేవుడు ఎంతకాలం అయితే ఆశీర్వదిస్తాడో.. అంతకాలం మనం పనిచేయగలుగుతాం:

దేవుడు ఆశీస్సులు, ప్రజల దీవెనలు రాజకీయాల్లో ముఖ్యం:

ఎంతకాలం మనం మంచి చేస్తే.. దేవుడు ఆశీర్వదిస్తాడు.. ఆ మంచి జరిగిన కాలం ప్రజలు ఆశీర్వదిస్తారు:

ఆ రెండూ ఉన్నంతకాలం.. ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు, ఇది వాస్తవం:

కాని ఈనాడు లాంటి పెద్ద సంస్థ నాకు తోడుగా లేకపోవచ్చు, ఆంధ్రజ్యోతి లాటి పత్రిక నాకు లేకపోవచ్చు. టీవీ–5 లాంటి సంస్థ నాకు లేకపోవచ్చు:

ఇంత మంది సంఖ్య నాకు లేకపోవచ్చు:

అబద్ధాన్ని నిజం చేసేందుకు, చెప్పిందే చెప్పి దాన్ని నిజంచేయడానికి ఈ మే«థావులు ప్రయత్నిస్తారు:

గోబెల్స్‌ ప్రచారంలో వీళ్లు దిట్టలు :

వీళ్లు ఏ అబద్ధం చెప్పినా దాన్ని నిజం చేయడానికి రాతలు రాస్తారు, స్క్రోలింగ్స్‌ వేస్తారు, టీవీల్లో చూపిస్తారు, మీడియాలో వీరి సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి ఏమైనా చేస్తారు:

కాని నిజం మాత్రం దాచలేరు:

ప్రజలకు మంచి జరుగుతుందా? లేదా? అన్నదాన్ని మార్చలేరు:

ప్రజలకు మంచి జరిగినంత కాలం, చంద్రబాబుగారు ఎంత డ్రామాలు చేసినా, చంద్రబాబుగారి కళ్లల్లో నీళ్లు తిరక్కపోయినా తిరిగినట్టుగా, తనంతట తానే డ్రామాలు చేయొచ్చు.. ఇలా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు:

దీన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లు ఏదో జరిగిపోయిందని చూపించవచ్చు:

ఏమీ జరగకపోయినా జరిగినట్టుగా వాళ్లే చెప్పేయొచ్చు:

ఆయనే అన్ని మాటలు మాట్లాడతాడు, ఆయనే డ్రామా చేస్తాడు:

ఎలాంటి మాటలు మాట్లాడకపోయినా... మాట్లాడినట్టు చూపించవచ్చు:

ఏమైనా జరగొచ్చు :

కాని చిట్టచివరిగా దేవుడు ఇవన్నీ చూస్తాడు :

ప్రజలు చూస్తూ ఉన్నారు:

దేవుడి దయ, ప్రజల దీవెన ఉన్నంతకాలం.. ఇలాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇలాంటి టీవీ–5లు ఎంత చంద్రబాబుగారిని మోసినా.. అంతిమంగా మంచే విజయం సాధిస్తుంది. 

చంద్రబాబుగారి మాటలు చూస్తే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది:

మా చిన్నాన్నగురించి చంద్రబాబుగారు మాట్లాడతాడు:

వివేకాగారు నాకు చిన్నాన్న, చంద్రబాబుగారికి కాదు :

సొంత మా నాన్న తమ్ముడు :

ఇంకోవైపు అవినాష్‌రెడ్డిపైన ఆరోపణలు చేస్తున్నారు:

అవినాష్‌రెడ్డి మరో చిన్నాన్న కొడుకు :

ఎవరైనా అలాంటి ఘటన ఎందుకు చేస్తారు అధ్యక్షా:

మన చేయితో మనకున్న కంటిని ఎందుకు పొడుచుకుంటాం:

వివేకా గారి హత్య జరిగింది చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది:

అప్పుడు మేం ప్రతిపక్షంలో ఉన్నారు :

మా చిన్నాన్న, అవినాష్‌రెడ్డి కూడా అప్పుడు  ప్రతిపక్షంలో ఉన్నారు:

మా చిన్నాన్నను ఓడించడం కోసం చేసిన అక్రమాలు అన్నీఇన్నీకావు:

కడప జిల్లాలో అప్పుడు ఎంపీటీసీలు, జడ్పీసీలు మాకు ఎక్కువ ఉన్నారు:

మేం ఎక్కడ గెలిచినా కూడా.. మా పార్టీ నుంచి చినాన్నన్నను మాపార్టీ నుంచి పోటీపెడితే.. బలవంతంగా మా ఎంపీటీసీలను, జడ్పీటీసీలను డబ్బు ఇచ్చి ప్రలోభాలు పెట్టి, స్పెషల్‌ ఫ్లైట్‌లు పెట్టి , పోలీసులను పెట్టి, కుయుక్తులను పన్ని.. ఇలా రకరకాలుగా అక్రమాలు చేసి మా చిన్నాన్నను ఓడించారు:

అంతటి దారుణంగా ప్రవర్తించారు:

మా చిన్నాన్నను ఏదైనా చేసి ఉంటే.. అది వాళ్లే చేసి ఉండాలి:

అటువంటి దాన్ని ట్విస్ట్‌చేసి, వక్రీకరించి.. ఏదేదో చేస్తున్నారు:

చివరకు మాకుటుంబంలోనే చిచ్చుపెట్టే కార్యక్రమాలను చేస్తున్నారు:

ఇలాంటి విషయాలు మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది:

అలాంటి విషయాలను కూడా ఇక్కడ రాజకీయంగా ట్విస్ట్‌చేసి, రాజకీయంగా మాట్లాడతారు:

ఏవేవో చెప్పే కార్యక్రమాలుచేస్తారు:

ఇది చాలా దురదృష్టకరం:

అయినా పైనా దేవుడు ఉన్నాడు.. ఆయనే చూస్తాడు:

Comments