కొవ్వూరు (ప్రజా అమరావతి);
నలుగురికి విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాల ప్రజలందరు ఉపయోగించుకోవాలని పుస్తక పఠనం ద్వారా మంచి భవిష్యత్తు ఏర్పరుచుకోడానికీ అవకాశం ఉన్నదని తహశీల్దార్ డి.నాగరాజు నాయక్ పేర్కొన్నారు
సోమవారం స్థానిక కొవ్వూరు ప్రధమ శ్రేణి శాఖా గ్రంధాలయంలో 54వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన పుస్తక ప్రదర్శనను ముఖ్య అతిధిగా హాజరై ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డి.నాగరాజు నాయక్ మాట్లాడుతూ, నలుగురికి విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాల ప్రజలదరు ఉపయోగించుకోవాలని
పేర్కొన్నారు. పుస్తక పఠనం మనలో జిజ్ఞాస ను పెంపొందిస్తుందన్నారు.
తొలుత జాతీయ గ్రంధాలయంలో నిర్వహించిన పుస్తక ప్రదర్శనను , పాఠశాల విద్యార్ధులకు మరియు జూనియర్ కళాశాల విద్యార్ధులకు దేశభక్తి గీతాల పోటీలును తిలకించడం జరిగినది. ఈ పోటీలలో సుమారు 100 మంది విద్యార్ధులు పాల్గొన్నారు . ఈ నెల 20 వ తేదీన ముగింపు ఉత్సవాల్లో విజేతలకు బహుమతులు అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో లైబ్రరీయన్ జీవివిఎన్.త్రినాధ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు
addComments
Post a Comment