న్యూఢిల్లీ (ప్రజా అమరావతి);
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమైన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యాటకాభివృద్ధిపై కేంద్ర మంత్రికి ప్రతిపాదనలను సమర్పించిన మంత్రి మేకపాటి.
సోమశిల ప్రాజెక్టు పరిసరాలు సహా అనంతసాగరం, సంగం మండలాల్లో పర్యాటక ప్రదేశాలుగా మార్చే అవకాశంగల ప్రాంతాల గురించి వివరించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.సోమశిల ప్రాజెక్టు సమీపంలో పురాతన కట్టడాలు, ప్రాచీన చరిత్ర కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దాలని వినతిపత్రం.
ఇప్పటికే నెల్లూరు జిల్లా పరిధిలో గల పర్యాటక ప్రదేశాలపై కేంద్ర మంత్రి ఆరా.
టెంపుల్ టూరిజం అభివృద్ధికి నెల్లూరు జిల్లాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర మంత్రికి తెలిపిన మంత్రి మేకపాటి.
addComments
Post a Comment