*ముఖ్యమంత్రితో కేంద్ర బృందం భేటీ*
*వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన వివరాలు తెలిపిన బృందం*
*రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించిన కేంద్ర బృందం
*
అమరావతి (ప్రజా అమరావతి):
– వరద నష్టం అంచనాకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందంతో సీఎం శ్రీ వైయస్.జగన్ భేటీ
– వరద బాధిత ప్రాంతాల్లో తాము పరిశీలించిన అంశాలను సీఎంకు వివరించిన కేంద్ర బృందం
– కేంద్ర బృందం తరఫున వివరాలు అందించిన కునాల్ సత్యార్థి, సలహాదారు, ఎన్‌ఎండీఏ, కేంద్ర హోంమంత్రిత్వశాఖ
– 3 రోజులపాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాం: కునాల్‌సత్యార్థి
– వీలైనన్ని గ్రామాలను, వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలనూ పరిశీలించాం:
– కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లింది:
– ఆ గ్రామాలను కూడా పరిశీలించాం:
– పశువులు చనిపోయాయి, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు.. ల్లాంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి:
– మీ నాయకత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసనీయం:
– అంకిత భావంతో పనిచేసే అధికారులు మీకు ఉన్నారు:
– వీరంతా మాకు మంచి సహకారాన్ని అందించారు:
– యువకులు, డైనమిక్‌గా పనిచేసే అధికారులు ఉన్నారు:
– విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారు:
– మా పర్యటనల్లో వివిధ రాజకీయ ప్రనిధులను, మీడియా ప్రతినిధులను కలుసుకున్నాం:
– ప్రతి ఒక్కరూ కూడా వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు:
– సంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదు:
– అలాంటి ప్రాంతంలో ఊహించని రీతిలో వర్షాలు పడ్డాయి:
– ఇంత స్థాయిలో వరదను తీసుకెళ్లగలిగే పరిస్థితి అక్కడున్న నదులు, వాగులు, వంకలకు లేదు:
– కరువు ప్రాంతంలో అతి భారీవర్షాలు కురిశాయి:
– ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యాంలు కూడా ఈ ప్రాంతంలో లేవు:
– ఉన్న డ్యాంలు, రిజర్వాయర్లు కూడా ఈస్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావు:
– ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తున్నాయి:
– కరువు ప్రాంతాల్లో కుంభవృష్టి, నిరంతరం మంచి వర్షాలు కురిసేచోట కరువు లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి:
– తీరందాటిన తర్వాత అల్పపీడనం వెంటనే తొలగిపోలేదు, అది చాలా రోజులు కొనసాగింది:
– కడప జిల్లాలో వరదల వల్ల నష్టం అధికంగా ఉంది:
– అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట... నష్టం అపారంగా ఉంది:
– చిత్తూరులో జిల్లాలో కొంత భాగం, నెల్లూరులో కూడా వరదల ప్రభావం అధికంగా ఉంది:
– కడప జిల్లాలో మౌలికసదుపాయాల నిర్మాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది:
– పంట చేతికందుతున్న సమయంలో నీట పాలైంది:
– శెనగ పంట కూడా తీవ్రంగా దెబ్బతింది:
– వాటర్ స్కీములు కూడా దెబ్బతిన్నాయి:
– అన్నమయ్య నుంచి వెళ్లే తాగునీటి సరఫరా వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది:
– ఇరిగేషన్‌కూ తీవ్ర నష్టం ఏర్పడింది:
– బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోవడం వల్ల చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి:
– వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు చాలా బాగా పనిచేశారు
– విద్యు™Œ సహా అన్నిరకాల శాఖలు చాలా బాగా పనిచేశాయి
– అత్యవసర సర్వీసులను వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు చాలా బాగా పనిచేశారు
– ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఇంత త్వరగా కరెంటు పునరుద్ధరణ అన్నది సహజంగా జరగదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం:
– సహాయ కార్యక్రమాలకోసం కలెక్టర్లకు వెంటనే నిధులు ఇచ్చారు. దీనివల్ల పనులు చాలా వేగంగా జరిగాయి.
– ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఏర్పాటును మేం చూడలేదు:
– ఈ డబ్బును బాధితులను వెంటనే ఆదుకునేందుకు వాడుకున్నారు:
– అలాగే జేసీబీలు పెట్టి.. అవసరమైనచోట యుద్ధ ప్రాతిపదికిన పనులు చేపట్టారు:
– సహాయక శిబిరాలను తెరిచి ముంపు బాధితులను ఆదుకున్నారు:
– క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకున్న ఈ చర్యలన్నీ ప్రశంసనీయం:
– వరదల వల్ల జరిగిన నష్టంలో 40శాతం రోడ్లు, భవనాలు ల్లాంటి రూపేణా జరిగింది. 32 శాతం నష్టం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జరిగింది, ఇగిగేషన్ స్కీంల రూపేణా 16శాతం మేర జరిగింది:
– వీలైనంత మేర ఆదుకోవడానికి మావంతు సహకారాన్ని అందిస్తాం:
– ధాన్యం కొనుగోలులో నిబంధనల సడలింపు చేయాలని కోరిన ప్రభుత్వం
భారీ వర్షాలు కారణంగా పంటలు దెబ్బతిన్నంటున తేమ, ఇతరత్రా నిబంధనల విషయలో సడలింపులు ఇవ్వాలని కోరిన ప్రభుత్వం.
కేంద్ర బృందంతో సీఎం ఏమన్నారంటే:
ఇలాంటి విపత్తు హృదయవిదారకరం: సీఎం
నష్టం అంచనాలకోసం మీరు ఆయా ప్రాంతాల్లో పర్యటించినందుకు ధన్యవాదాలు:
ఉదారంగా, మానవతా పరంగా స్పందించాలని కోరుతున్నా:
మేం పంపించిన నష్టం వివరాల్లో ఎలాంటి పెంపూ లేదు :
నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో మాకు సమర్థవంతమైన వ్యవస్థఉంది:
ప్రతి గ్రామంలో ఆర్బీకే ఉంది, ప్రతి రైతు పంటకూడా ఇ–క్రాప్ అయ్యింది:
సోషల్‌ఆడిట్‌కూడా చేయించాం:
ఇ– క్రాప్‌కు సంబంధించి రశీదుకూడా రైతుకు ఇచ్చాం:
నష్టంపోయిన పంటలకు సంబంధించి కచ్చితమైన, నిర్దారించబడ్డ లెక్కలు ఉన్నాయి:
క్షేత్రస్థాయిలో నష్టానికి సంబంధించి వాస్తవ వివరాలను మీకు అందించాం:
కోవిడ్ నియంత్రణా చర్యలకోసం వినియోగించినందువల్ల ఎస్టీఆర్‌ఎఫ్ నిధులు నిండుకున్నాయని మా ఆర్థిక శాఖ కార్యదర్శి మీకు వివరించారు:
పనులు చేయాలంటే నిధులు అవసరం, వెంటనే అడహాక్ ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని కోరుతున్నాం:
కేంద్ర బృందం చేసిన సూచనలనూ పరిగణలోకి తీసుకుంటాం:
దీర్ఘకాలంలో ఇలాంటి విపత్తులను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం:
వరదనీటిని తరలించడానికి ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేలా ఇటీవలే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం:
వీలైనంత త్వరగా పెద్దమొత్తంలో నీటిని తరలించే అవకాశం ఏర్పడుతుంది:
ఈకార్యక్రమంలో భాగంగా ఇప్పుడున్న రిజర్వాయర్లు, డ్యాంలపై పరిశీలన చేసి తగిన చర్యలు చేపడతాం:
ఆటోమేటిక్ వాగర్ గేజ్ సిస్టంపైనా దృష్టిపెడతాం:
addComments
Post a Comment