*మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో మత్తు పదార్ధాలకు బానిసలైన వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన సిఐ అంకమ్మరావు.*
మంగళగిరి (ప్రజా అమరావతి);
మత్తు పదార్ధాలకు బానిసలు కాకుండా గంజాయి భారీన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించిన పట్టణ సిఐ అంకమ్మరావు.
మత్తు పదార్ధాల వల్ల యువత సమస్యలను కొని తెచ్చుకోవడమే కాకుండా తల్లిదండ్రులను తీరని ఆవేదనలకు గురిచేస్తున్నారని అన్నారు.
*అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హాఫీజ్ మరియు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ రాంబాబు అదేశాల మేరకు పట్టణంలో పలు ప్రాంతాల్లో నేడు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.*
పలువురు గతంలో గంజాయి విక్రయాలు చేస్తూ, సేవించే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు దాని వల్ల వచ్చే ఇబ్బందులను తెలియజేసిన సిఐ.
ప్రస్తుతం కొందరు గంజాయి కాకుండా వైట్ నర్ ను సేవిస్తున్నారు.
తల్లిదండ్రులు దీనిని గమనించి మీ పిల్లలపై శ్రద్ధ చూపాలని. మీ మాట వినని పక్షంలో వారిని తమ వద్దకు తీసుకువస్తే తమ శైలిలో కౌన్సెలింగ్ ఇస్తామని, తగు సూచనలు చేసిన పట్టణ సి.ఐ అంకమ్మరావు.
addComments
Post a Comment