చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసమే పాదయాత్ర" - కాకాణి

 *"చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసమే పాదయాత్ర" - కాకాణి*




*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .




 చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉండాలంటూ వెనుక ఉండి పాదయాత్ర చేయిస్తున్నాడు...


అది అమరావతి రైతులు చేస్తున్న యాత్ర కాదు, చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేయిస్తున్న పాదయాత్ర.


చంద్రబాబు చేయిస్తున్న పెయిడ్ యాత్రకు  తానే పెద్ద ఎత్తున విరాళం ఇస్తున్నారు...


చంద్రబాబు ఏనాడైనా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల సమయంలో ఇంత పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారా...!


చంద్రబాబు తాను  అధికారంలో ఉన్నప్పుడు రాజధాని భూములను తన బినామీలతో కొనుగోళ్లు చేయించాడు.


చంద్రబాబు తన బినామీల భూముల కోసమే అమరావతి పేరిట గగ్గోలు పెడుతున్నాడు.


రాజధానిగా అమరావతి నిలుపుకుంటే తప్ప, భూములకు విలువ దక్కదనే భయంతో చంద్రబాబు తాపత్రయ పడుతున్నాడు.


అమరావతిలో తాత్కాలిక భవనాలు తప్ప, ఏ ఒక్క శాశ్వత భవనమైన నిర్మించారా!


చంద్రబాబు 4లక్షల కోట్లతో రాజధాని నిర్మాణమంటూ గ్రాఫిక్స్ లో చూపించాడు.


ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి ఆయన విగ్రహానికి మాల వేస్తున్న ఘనుడు చంద్రబాబు.


అమరావతిని అభివృద్ధి చేయకుండా, తన భూములను కాపాడుకునేందుకు రైతుల్ని మోసం చేశారు.


చంద్రబాబు మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు కమిటీలను వేయించాడు.


చంద్రబాబు మద్దతిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీలు చెప్పిన నివేదిక అభివృద్ధి వికేంద్రీకరణ చేయమని...


చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కమిటీ నివేదికలను బేఖాతరు చేశాడు.


  హైదరాబాద్ లో అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కావడంతో, ఏర్పాటువాదం ఊపందుకుంది.


 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రెండు కమిటీలను వేసింది.

ఆ రెండు కమిటీలు కూడా గతంలో వేసిన కమిటీల నివేదికలను బలపరిచాయి.


 చంద్రబాబు డైరెక్షన్ లో చేస్తున్న పాదయాత్రను ప్రజలు ఎవ్వరూ నమ్మడం లేదు.

Comments